50 లక్షలు ఇప్పించండి... సుప్రీంకు చేరిన దిశ ఎన్‌కౌంటర్ కుటుంబాలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యకేసులో నిందితుల కుటుంబాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఎన్‌కౌంటర్‌పై కేసును నమోదు చేయాలని సుప్రీంను కోరాయి. మరోవైపు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టును అభ్యర్థించాయి. ఎన్‌కౌంటర్‌పై పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.
ఇక దిశ ఎన్‌కౌంటర్ తర్వాత రాష్ట్ర పోలీసులు కేసునమోదు చేయగా మొత్తం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు మాజీ జస్టీస్ వీఎస్ సిర్ఫర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బృందంతో విచారణ కమీషన్ వేసింది. ఆరునెలల్లోగా పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని సమయం విధించింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌కౌంటర్‌పై పలు కోర్టుల్లో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు మృతదేహాల ఖననం కూడ ఆగిపోయిన విషయం తెలిసిందే...

కాగా దిశ సంఘటన జరిగిన తర్వాత నిందితుల కుటుంబ సభ్యులు కూడ వారిని ఎన్‌కౌంటర్ చేసినా పర్వాలేదనే స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఎన్‌కౌంటర్ తర్వాత పెద్దగా వ్యతిరేకించిన పరిస్థితి కనిపించలేదు.. అయితే మారుతున్న పరిణామాలతో ఎన్‌కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన చెన్నకేశవులు భార్య మాత్రం తమకు నష్టపరిహరం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది... దీంతో నేడు కుటుంబాలు న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీం కోర్టుకు చేరాయి.












Click it and Unblock the Notifications