రవి కుటుంబ సభ్యులకు బెదిరింపు ఫోన్లు: భార్యను విచారించిన సిఐడి

బెంగళూరు: అనుమానాస్పదస్థితిలో మరణించిన ఐఏఎస్ అధికారి డి.కే. రవి కుటుంబ సభ్యులకు అప్పుడే బెదిరింపు ఫోన్లు వస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం రవి అన్న రమేష్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడని చెబుతున్నారు. మీరు ధర్నాలు, పాదయాత్రలు, సీబీఐ దర్యాప్తులు అంటు తిరిగితే మీ కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి.

వెంటనే రమేష్ తన పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్న హులియూరు దుర్గలోని జ్ఞానభారతి స్కూల్ కు ఫోన్ చేశాడు. మాపిల్లలు స్కూల్ లో ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి తమ పిల్లలను పంపించమని చెబితే నమ్మవద్దని మనవి చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రమేష్ మొబైల్కు ఎక్కడి నుండి ఫోన్ వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.

DK Ravi death: family members threatened

కుటుంబ సభ్యుల విచారణ

కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడి అధికారులు శుక్రవారం ఉదయం డి.కే. రవి భార్య కుసుమ, మామ హనుమంతరాయప్పను విచారణ చేసి వివరాలు సేకరించారు. రవి మరణించిన సోమవారం ముందు రోజులైన శని, ఆదివారాలలో మీరు ఎక్కడికి వెళ్లారు, ఎవరిని కలిశారు, ఆ రోజు ఎలాంటి సంఘటన జరిగాయి అని వివరాలు సేకరించారు.

కోరమంగలలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం చేరుకుని అక్కడ పని చేస్తున్న అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా మాట్టాడి ఒక్కొక్కరి నుండి వివరాలు సేకరించారు. రవి క్యాబిన్ లోని కొన్ని పత్రాలను సీఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకొక టీం కోలారు వెళ్లి అక్కడి కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బందిని విచారణ చేసి వివరాలు సేకరించారు. సీఐడి ఐజీపీ ప్రణబ్ మోహంతి ఇప్పటి వరకు ఈ కేసు దర్యాప్తలో జోక్యం చేసుకొలేదు. ఆయన సీఐడి ఐజీపిగా పదవిలో కొనసాగుతున్నారు.

రూ. 10 లక్షలు, ఒకరికి ఉద్యోగం!

రాష్ట్రంలోని ఒక్కలిగుల సంఘం (ఒక్కలిగ కులస్తుల సంఘం) ఆధ్వర్యంలో శుక్రవారం రవికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో పలువురు నాయకులు రవి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించారు. ఒక్కలిగుల సంఘం నుండి రవి కుటుంబ సభ్యులకు రూ. 10 లకలు ఆర్థిక సహాయం అందించాలని, ఒకరికి ఉద్యోగం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+