బీజేపీ నాయకుల వలనే రాష్ట్రానికి లేనిపోని సమస్యలు, నీళ్లతో రాజకీయం !
బెంగళూరు: కావేరీ నీటి సమస్య, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలపై ప్రధాని నరేంద్ర మోదీని నిలదీసి మాట్లాడే ధైర్యం కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలకు లేదని, ఇలాంటి నేతల వల్ల కర్ణాటక కష్టాల్లో కూరుకుపోయిందని బీజేపీ నేతలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. బెంగళూరు నగరంలో డీకే శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ నాయకుల మీద మండిపడ్డారు.
కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనేక పనులకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ బీజేపీకి దక్కలేదన్నారు. కర్ణాటక రాష్ట్రాభివృద్ధికి బీజేపీ నాయకులు ఇబ్బందులు కలిగిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. కావేరి నీటి పంపిణి విషయంలో బీజేపీ నాయకులు రాజకీయాలు చెయ్యాల్సిన అవసరం లేదని డీకే శివకుమార్ చెప్పారు.

అందరం కలిసి పని చేద్దాం అన్నది నా వైఖరి. బీజేపీ నాతో ఏ విషయం గురించి చెప్పినా తాను వింటానని, కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పని చేస్తానని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నదీ వివాదాలన్నింటినీ మూడేళ్లలో పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వమే చట్టం చేసింది. అయితే కావేరీ నీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అని డీకే శివకుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

రెండు రాష్ట్రాలను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించలేరా? ఏ సమస్యలు పరిష్కరించగలరో చెప్పాలని బీజేపీ నాయకులను డీకే శివకుమార్ ప్రశ్నించారు. మేకదాటు పథకం అమలు చేసి ఉంటే కావేరి నీటి పంపిణి విషయంలో ఇలాంటి సమస్య వచ్చేది కాదని డీకే శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా సభలు నిర్వహిస్తుందని, నీటి సమస్యపై సభ పెట్టలేదా అని విపక్షాల ప్రశ్నకు డీకే శివకుమార్ బదులిస్తూ మేమంతా సమావేశాలు నిర్వహిస్తామని అన్నారు.

ఆయా నేతలకు తమ రాష్ట్రాల ప్రయోజనాలే ప్రధానం. పైన కూర్చున్న కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితి తెలుసు. ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని డీకే శివకుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీకి వినతిపత్రం సమర్పించే ముందు రెండు రోజుల పాటు కావేరీ నీటిని తమిళనాడుకు వదలాలని న్యాయనిపుణులు సలహా ఇచ్చారని, అయితే మేము తమిళనాడుకు నీరు విడుదల చేయబోమని చెప్పామని డీకే శివకుమార్ అన్నారు.

మనం సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు కావేరి మేనేజ్ మెంట్ బోర్డు ఆదేశాలను పాటించారా లేదా అనేది తనిఖీ చేయబడుతుందని, కోర్టు ఆదేశాలు పట్టించుకోకుంటే ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోందని డీకే శివకుమార్ అన్నారు. కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు పరిస్థితిని వివరించాము. తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటామో కూడా చెప్పాం అని డీకే శివకుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications