మోదీ దెబ్బతో అధికార పార్టీకి భయం, క్రాస్ ఓటింగ్ ఫివర్, ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్లు

కర్ణాటకలో ఫిబ్రవరి 27న జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఓట్లను కొనుగోలు చేసేందుకు జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ఆఫర్‌ ఇస్తున్నారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో ఒక్కటి మాత్రమే గెలుచుకునే శక్తి ఉన్నప్పటికీ, బీజేపీ-జేడీఎస్ కూటమి రెండో అభ్యర్థిని బరిలోకి దించడంతో కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేడి రాజుకుంది.

మాజీ సీఎంహెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరికి ఫోన్ చేస్తున్నారో మాకు తెలుసు, ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఏం ఆఫర్ చేస్తున్నారో మాకు తెలుసు, మా ఎమ్మెల్యేలు మాకు మొత్తం సమాచారం ఇచ్చారని, బీజేపీ వ్యూహం ఏమిటో మాకు తెలుసు అని కేపీసీసీ అధ్యక్షుడు, డీసీఎం డీకే శివకుమార్ అన్నారు. ప్రత్యర్థి పార్టీలు పక్కాప్లాన్ తో క్రాస్ ఓటింగ్ కు ప్రయత్నిస్తున్నాయని డీసీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

DK Sivakumar has alleged that BJP and JDS have made offers to our partys MLAs for the Rajya Sabha elections,

బీజేపీ, జేడీఎస్ పార్టీలు కాంగ్రెస్ నాయకులకు వల వేస్తున్నారా అని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన డీకే శివకుమార్ ఎలాంటి కారణం లేకుండానే, ఎలాంటి ప్లాన్ లేకుండానే బీజేపీ అభ్యర్థిని నిలబెట్టిందా ?, లేకుంటే తమ సత్తా చాటేందుకే రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టింది చూద్దాం అని డీకే శివకుమార్ అన్నారు. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ రోజు ఎవరికి ఎవరు ఓటేస్తారో చూద్దామని బీజేపీ జేడీఎస్ నాయకులకు డీకే శివకుమార్ సవాలు విసిరారు

మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరితో మాట్లాడారో, ఎవరికి ఎంత ఆఫర్ చేశారు, ఎమ్మెల్యేను బెదిరించారా అనే పూర్తి విషయం తనకు తెలుసని, దాని గురించి ఇప్పుడు మాట్లాడనని, రాజ్యసభ ఎన్నికల పోలింగ్ పూర్తి అయిన తరువాత మాట్లాడుతానని డీకే శివకుమార్ అన్నారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జేడీఎస్ గతేడాది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది.

224 మంది సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో 135 మంది ఎమ్మెల్యేలు ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ, సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన ఎమ్మెల్యే దర్శన్ పుట్టన్నయ్య, ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో మూడింటిని గెలుచుకోవాలని భావిస్తున్నారు. బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఒకరిని గెలిపించుకునే అవకాశం ఉందని డీకే శివకుమార్ అంటున్నారు.

అజయ్‌ మాకెన్‌, సయ్యద్‌ నాసిర్‌ హుస్సేన్‌, జీసీ చంద్రశేఖర్‌లను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ. ఆశ్చర్యకరంగా జేడీఎస్ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు డి.కుపేంద్ర రెడ్డి కూడా గత వారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, కేవలం నలుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటే, ప్రతి అభ్యర్థి గెలవడానికి 45 ఓట్లు పొందాలి.

రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల ఓట్లను రాబట్టుకునేందుకు కాంగ్రెస్ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తోందా అని అడిగిన ప్రశ్నకు డీకే శివకుమార్ అది మాకు అవసరం లేదని, 136 సీట్లు గెలిచి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మాతో గుర్తింపు తెచ్చుకున్నారని, ఇతరుల గురించి నేను మాట్లాడనని, మాతో ఎవరు ఉన్నారు అనే విషయం రాజ్యసభ ఎన్నికల సమయంలో చూపిస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+