ఏం జరుగుతోంది ? కరుణానిధితో స్టాలిన్, అళగిరి భేటీ

డీఎంకే పార్టీ కోశాధికారి, పార్టీలో నెంబర్ టూ అయిన కరుణానిధి కుమారుడు స్టాలిన్ పార్టీ కార్యక్రమాల గురించి చర్చించడానికి శనివారం తండ్రి కరుణానిధిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు.

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధిని శనివారం ఆయన పెద్ద కుమారుడు అళగిరి కలిసి పార్టీ తదుపరి కార్యక్రమాలపై చర్చించారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం డీఎంకే పార్టీ కోశాధికారి, పార్టీలో నెంబర్ టూ అయిన కరుణానిధి కుమారుడు స్టాలిన్ సైతం పార్టీ కార్యక్రమాల గురించి చర్చించడానికి శనివారం తండ్రి కరుణానిధిని కలిశారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ పరిణామాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.

డీఎంకే పార్టీ భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యాక్రమాల గురించి కరుణానిధి కుమారుడు స్టాలిన్ కు వివరించారని తెలిసింది. డిసెంబర్ 20వ తేదిన డీఎంకే పార్టీ అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించి చర్చించాలని నిర్ణయించారు.

DMK General Council will meet on December 20 in Chennai

డిసెంబర్ 20వ తేదీ పార్టీ కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని పార్టీ సీనియర్లు, ఎంపీలు, శాసన సభ్యులకు శనివారం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. జయలలిత మరణించిన తరువాత డీఎంకే పార్టీ సమావేశం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చకచక చెయ్యడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

ఇదే సమయంలో అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది ? పన్నీరు సెల్వం సీఎంగా ఉండటం ఆ పార్టీ నాయకులు ఇష్టమేనా ? అన్నాడీఎంకేలో చీలిక వస్తుందా ? వస్తే ఏమి చెయ్యాలి అని డీఎంకే నాయకులు ఆలోచనలో పడ్డారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+