ఇదీ విషయం: వైద్యులకు రూ.వెయ్యికోట్ల తాయిలాలు.. అందుకే డోలో-650 రిఫర్
కరోనా తర్వాత డోలో 650 యూసెజ్ పెరిగింది. అవును జ్వరంగా ఉంటే చాలు వేసుకోవడం జరుగుతుంది. ప్రతీ ఇంట్లో డోలో 650 ఉండాల్సిందే.. అయితే దీనికి సంబంధించి మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకు వివరించింది. ఇందుకోసం వైద్యులకు రూ.1000 కోట్ల ముడుపులు అందాయని పేర్కొంది. అవీ ధనరూపేణ, మొబైల్స్ రూపంలో కూడా అందాయని తెలిపింది.
రోగులకు డోలో 650 ఇవ్వడానికి వైద్యులకు కంపెనీలు ముడుపులు అందించాయి. ఈ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. చాలా ఆందోళనకరమైన అంశం అని.. కరోనా సోకిన సమయంలో.. ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలని వైద్యులు సూచించారని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు.

ఫార్మా సంస్థలు నైతికంగా వ్యవహరించేలా చూడటం ముఖ్యం అని మెడికల్ రిప్రంజెటెటివ్ అసోసియేషన్ అభిప్రాయపడింది. కంపెనీలు వైద్యులకు ఉచితాలు అందించకుండా నిలిపేనిచట్టమేమీ లేదని కోర్టుకు తెలిపింది. ప్రజలకు ఇలా మెడిసిన్ ఇచ్చే ప్రక్రియ చాలా ప్రమాదకరం అని పేర్కొంది. ఈ పిటిషన్‌కు సంబంధించి పదిరోజుల్లో స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ డోలో 650 మాత్రలను తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కంపెనీ సీఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాల్లో గతంలో సోదాలు జరిగాయి. మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కార్యాలయంలో పలు పత్రాలు లభించాయి. 2020లో కరోనా వ్యాప్తించిన తర్వాత కంపెనీ రికార్డుస్థాయిలో 350 కోట్ల టాబ్లెట్లను విక్రయించింది. ఏడాదిలో రూ.400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications