విఐపీ హోదాలో షిర్డీలో బాబాను దర్శించుకోవాలంటే ఇలా చేయాల్సిందే

ప్రసిద్ద షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం ఇక క్యూ లైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేదు. రక్తదానం చేస్తే ఇక షిర్డీ ఆలయంలో విఐపి హోదాలో దర్శనం చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది సాయిబాబా ట్రస్టు.

ముంబై: ప్రసిద్ద షిర్డీ ఆలయంలో సాయిబాబా దర్శనం కోసం ఇక క్యూ లైన్లలో వేచి చూడాల్సిన అవసరం లేదు. రక్తదానం చేస్తే ఇక షిర్డీ ఆలయంలో విఐపి హోదాలో దర్శనం చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది సాయిబాబా ట్రస్టు.

షిర్డీలో బాబా దర్శనం కోసం రోజుల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.ఎంచక్కా విఐపి హోదాలో దర్శనం చేసుకొనే వెసులుబాటును కూడ కల్పించింది సాయిబాబా ట్రస్టు.

Donate blood, get VIP pass at Shirdi

సాయిబాబాను దర్శించుకొనేందుకు వెళ్ళినవారు రక్తదానం చేయడం ద్వారా ఒక ఏడాదిపాటు ఆలయంలో విఐపీ హోదాలో దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు సత్రాల్లో కూడ బస విషయంలో కూడ విఐపి హోదాను కల్పిస్తారు.

సర్వమానవ శ్రేయస్సు కోసం ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు ట్రస్ట్ ఛైర్మెన్ సురేష్ హరే ప్రకటించారు. షిర్డిని బ్లడ్ బ్యాంక్ హబ్ గా మార్చడం తమ ఉద్దేశ్యమన్నారు.

తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించినట్టుగానే షిర్డీకి వచ్చినవారు రక్తదానం చేయడం ఆనవాయితీగా మారుస్తామన్నారు. రక్తదానం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారాయన. రక్తదానం చేయడం ద్వారా మానవతా తృక్పథాన్ని చాటుకోవడంతో పాటు ఒక మంచి పనిచేశామనే సంతృప్తి కూడ దక్కనుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+