Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: ఒక్కసారి మిస్, రెండోసారి టాప్ సెలబ్రిటీ చెల్లెలు విచారణ, బావమరిది దెబ్బతో అర్జున్ సోదరికి!

ముంబాయి/ బెంగళూరు/ న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పద మృతి కేసు తరువాత బాలీవుడ్ డ్రగ్స్ కేసు మాఫియా వెలుగులోకి రావడంతో కేసు రసవత్తరంగా మారింది. బాలీవుడ్ డ్రగ్స్ కర్మకాండ అనేక మంది ప్రముఖ హీరోలు, హీరోయిన్ల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పుడు ప్రముఖ హీరో అర్జున్ రామ్ పాల్ సోదరికి ఎన్ సీబీ అధికారులు రెండోసారి సమన్లు జారీ చెయ్యడం, ఆమె విచారణకు హాజరుకావడం కొందరిలో కలకలం రేపింది.

ఇప్పటికే ఒక్కసారి ఎన్ సీబీ అధికారుల విచారణ నుంచి తప్పించుకున్న అర్జున్ రామ్ పాల్ సోదరి కోమల్ రామ్ పాల్ ఇప్పుడు ఎన్ సీబీ అధికారుల ముందు విచారణకు హాజరైయ్యింది. ఈ దెబ్బతో కొందరు సెలబ్రిటీలకు సినిమా కష్టాలు మొదలైనాయని బాలీవుడ్ లోని ఓ వర్గం అంటోంది.

ఒక్క దెబ్బతో సెలబ్రిటీలకు షాక్

ఒక్క దెబ్బతో సెలబ్రిటీలకు షాక్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు తరువాత బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఓ ఊపుఊపేసింది. బాలీవుడ్ డ్రగ్స్ కర్మకాండ కేసులో అనేక మంది ప్రముఖ హీరోలు, హీరోయిన్ల మెడకు చుట్టుకుంటోంది. ఇప్పటికే రియా చక్రవర్తితో సహ అనేక మంది అరెస్టు అయ్యి జైలుపాలైన తరువాత కొందరు బెయిల్ మీద బయటకు వచ్చారు. దీపికా పదుకొనే, శ్రద్ధాకపూర్, సారా ఆలీఖాన్ తదితరులను ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు.

అర్జున్ రామ్ పాల్

అర్జున్ రామ్ పాల్

బాలీవుడ్ నటుడు, మోడల్, సినీ ప్రముఖుడు అర్జున్ రామ్ పాల్ ను ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు. అర్జున్ రామ్ పాల్ తో పాటు అతని ప్రియురాలి గెబ్రియోల్లా డెమెట్రియెడ్స్, ఆమె సోదరుడు అగిసిలాస్ ను ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్ డ్రగ్స్ సరఫరా చేసేవారితో సంబంధాలు పెట్టుకున్నాడని అరోపిస్తూ అతన్ని ఇప్పటికే ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు.

బావమరిది దెబ్బతో హడల్

బావమరిది దెబ్బతో హడల్

అర్జున్ రామ్ పాల్ లవర్ గెబ్రియెల్లా డెమెట్రియెడ్స్ సోదరుడు అగిసిలాస్ తరువాత కోర్టులో బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. అర్జున్ రామ్ పాల్ ఇంట్లో సోదాలు చేసిన సమయంలో అక్కడ నిషేధిత ఔషదాలు చిక్కాయని ఎన్ సీబీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇదే కేసులో అర్జున్ రామ్ పాల్ ను ఎన్ సీబీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

హీరో సోదరికి చిక్కులు

హీరో సోదరికి చిక్కులు

ఎన్ సీబీ అధికారులు జనవరి 6వ తేదీన విచారణకు హాజరుకావాలని హీరో అర్జున్ రామ్ పాల్ సోదరి కోమల్ రామ్ పాల్ కు నోటీసులు జారీ చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని, విచారణకు హాజరుకావడానికి సమయం కావాలని కోమల్ రామ్ పాల్ ఆమె న్యాయవాదుల తరుపన ఎన్ సీబీ అధికారులకుసమాచారం ఇచ్చింది.

Recommended Video

    Oxford Vaccine in UK: First person in UK receives new Oxford-AstraZeneca vaccine | Oneindia Telugu
    ఎన్ సీబీ ఆఫీస్ లో మేడమ్ కోమల్

    ఎన్ సీబీ ఆఫీస్ లో మేడమ్ కోమల్

    మళ్లీ విచారణకు హాజరుకావాలని కోమల్ రామ్ పాల్ కు రెండోసారి నోటీసులు జారీ అయ్యాయి. సోమవారం ముంబాయిలోని ఎన్ సీబీ కార్యాలయానికి కోమల్ రామ్ పాల్ కు విచారణకు హాజరైయ్యింది. సాయంత్రం వరకు కోమల్ రామ్ పాల్ ను ఎన్ సీబీ అధికారులు విచారణ చేసి ఆమె చెప్పిన స్టేట్ మెంట్ ను ఎన్ సీబీ అధికారులు రికార్డు చేశారు. అయితే కోమల్ రామ్ పాల్ ఏం చెప్పింది ? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. కోమల్ రామ్ పాల్ ను విచారణకు హాజరుకావాలని రెండోసారి నోటీసులు జారీ చేసినమాట వాస్తవమని, ఆమె విచారణకు హాజరై స్టేట్ మెంట్ ఇచ్చారని ఎన్ సీబీ అధికారులు చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+