తప్ప తాగి కారును ఆలయంలోకి దూకించాడు

Drunk Driver Almost Rams Car Into Temple
న్యూఢిల్లీ: మధ్య ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి 11.30 ని. లకు తాగిన మైకంలో డ్రైవర్ ఆగి ఉన్న క్యాబ్‌ను ఢీ కొట్టాడు. ఈ సంఘటనలో హుందాయ్ వెర్నా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఆగి ఉన్న క్యాబ్‌ను ఢీ కోట్టడంతో పాటు ఎదురుగా ఉన్న దేవాలయంలోకి కారు దాదాపుగా దూసుకెళ్లింది.

ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు ఎవరూ చనిపోలేదని చెప్పారు. సంఘటనా స్దలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు మాత్రం కారు డ్రైవర్ బాగా త్రాగిన మైకంలో ఉన్నాడని పోలీసులకు తెలిపారు.

ఇటీవల కాలంలో రాజధానిలో త్రాగి డ్రైవింగ్ చేసిన సంఘటనలు చాలానే నమోదయ్యాయి. ఈ సంవత్సరం జనవరి 1 నుండి ఆగస్టు 15 వరకు సుమారు 20,400 త్రాగి డ్రైవింగ్ చేసిన కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల మొదటి వారంలో ఓ కారు డ్రైవర్ త్రాగిన మైకంలో చేసిన డ్రైవింగ్ వల్ల ఓ అమాయకుడి ప్రాణాన్ని బలిగొన్నాడు. ఇటీవలే ఢిల్లీ పోలీసులు తరుచుగా త్రాగి డ్రైవింగ్ చేసిన 16,000 నేరస్ధుల డ్రైవింగ్ లైసెన్సును రద్దు చేయాల్సిందిగా రవాణా శాఖకు లేఖ రాశారు.

2007లో సుందర్ కమిటీ త్రాగి లేదా వేగంగా నడిపే వారికి భారీగా జరిమానా విధించాల్సిందిగా సిఫార్సు చేసింది. ఒకే వ్యక్తి రెండవ సారి అదే నేరానికి పాల్పడినట్లైతే అతని డ్రైవింగ్ లైసెన్సుని రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఇండియాలో 6 శాతం ప్రమాదాలు త్రాగి నడపడం వల్ల సంభవిస్తుండగా.. 44 శాతం మితిమీరిన వేగం వల్ల సంభవిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+