తాగి, గర్ల్స్ హాస్టల్లోకి: హంగామా చేసిన ఎంటెక్ విద్యార్థి

భోపాల్: మౌలానా ఆజాద్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఎన్ఐటీ)కు చెందిన ఓ విద్యార్థి గురువారం గర్ల్స్ హాస్టల్‌లోకి వెళ్లి హంగామా చేశాడు. హాస్టల్లోకి వచ్చిన విద్యార్థి పేరు అజయ్ కుమార్. అతని వయస్సు 21. భోపాల్‌లోని ఎంఏఎన్ఐటీలో మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ పట్టా తీసుకున్నాడు.

ప్రస్తుతం దుర్గాపూర్‌లో ఎంటెక్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూ నిమిత్తం భోపాల్ వచ్చిన అజయ్ కుమార్ మిత్రుడి వద్ద షెల్టర్ తీసుకున్నాడు. గురువారం నాడు తప్పతాగి నేరుగా ఎంఏఎన్ఐటీ క్యాంపస్‌కు వెళ్లాడు. అక్కడ అమ్మాయిల హాస్టల్లోని స్టడీ లాంజ్‌లో ప్రవేశించి హంగామా చేశాడు.

దీంతో, ఆందోళన చెందిన విద్యార్థులు వార్డెన్‌ను పిలిచారు. వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పోలీసులు అజయ్ కుమార్‌ను అరెస్టు చేశారు.

Drunk MANIT grad enters girls’ hostel, triggers ruckus

కంపాస్‌తో గుచ్చి, నీళ్లలో ముంచి చంపేశారు

పదో తరగతి చదివే పిల్లల మధ్య వచ్చిన చిన్న తగాదా ఏకంగా ఓ హత్యకు దారితీసింది. కాసర్‌గాడ్‌లోని ఓ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బడి నుంచి సాయంత్రం ఇంటికి వస్తున్నారు. ఆ సమయంలో ఏదో విషయమ్మీద వారిలో ఒకడితో మిగిలిన ఇద్దరు విద్యార్థులు గొడవపడ్డారు.

దాంతో వారిద్దరూ కలిసి మూడో విద్యార్ధిని చావబాదారు. ఈ క్రమంలో దాడి చేసిన విద్యార్థుల్లో ఒకడు తన జామెంట్రీ బాక్సులోని కంపాస్‌తో బాధిత బాలుడి కంటి దగ్గర లోతుగా పొడవటంతో ఆ బాలుడు కిందపడిపోయాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ గాయపడిన బాలుడిని దగ్గరలోని ఓ కుంట దగ్గరకు ఈడ్చుకెళ్లి నీళ్లలో ముంచేయటంతో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+