వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్‌లో ఇసుక తుఫాను: 19మంది మృతి, 60మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన ఇసుక తుఫాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. 60మందికి పైగా గాయాలయ్యాయి. బికనీర్, నాగౌర్‌, జోథ్‌పూర్‌, జైపూర్‌, ఆల్వార్‌, భరత్‌పూర్‌, సవాయ్‌ మాథోపూర్‌ తదితర ప్రాంతాల్లో తుపాన ప్రభావం ఎక్కువగా ఉంది.

తుఫాను కారణంగా భారీ వృక్షాలు నేలకొరిగాయి. పెద్ద ఎత్తున వచ్చిన గాలి వల్ల దాదాపు 50 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.

Dust storm claims 19 lives in Rajasthan, over 60 injured

భరత్‌పూర్ ప్రాంతంలో తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఇక్కడ ఐదుగురు మృతి చెందారు. మరో 50మందిపైగా గాయాపడ్డారు. జిల్లాలో 50ఇళ్లకు పైగా ధ్వంసమయ్యాయి.
పలు జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు నెలకూలడంతో అంధకారం నెలకొంది.

అధికారులు, పోలీసులు, సహాయక బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కాగా, తుఫాను కారణంగా మృతిచెందిన వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధర రాజే రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

English summary
The death toll due to the dust storm in Rajasthan has risen to 19 and over 60 persons have been injured in related incidents, according to reports late on Wednesday. The death toll is likely to go up, said authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X