భారత్‌లో వ్యాక్సిన్ల కొరత: అమెరికా సాయం చేస్తుందా? -విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక పర్యటన

కరోనా రెండో దశ విలయం ఉధృతంగా కొనసాగుతోన్న భారత్ లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అవుతోన్న టీకాల సంఖ్య తక్కువ ఉండటం, ముడిసరుకు దిగుమతిలో ఇబ్బందులు కొనసాగుతుండటం తదితర అంశాల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అందజేసే సాయం కీలకంగా మారింది. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టారు.

ప్రధాని మోదీ సమర్థించిన రిపబ్లికన్ ట్రంప్ ఓడిపోయి, జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత భారత ప్రభుత్వానికి చెందిన అత్యున్నత మంత్రి అగ్రరాజ్యంలో కీలక పర్యటన చేస్తుండటం ఇదే ప్రధమం. అందునా, దౌత్యవేత్తగా సుదీర్ఘ అనుభవమున్న జైశంకర్ మంత్రి హోదాలో నెరపబోయే మంత్రాంగాలపై ఉత్కంఠ నెలకొంది.

EAM S Jaishankar in US on 5-day visit to cover Covid, bilateral ties

ఐదురోజుల అమెరికా పర్యటనలో భాగంగా మంత్రి జైశంకర్ న్యూయార్క్‌లో అక్క‌డి ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌తో భార‌త్‌, అమెరికా మధ్య కరోనా చికిత్స‌కు సంబంధించిన సహకారంపై చ‌ర్చించ‌నున్నారు. యూఎన్‌ భద్రతా మండలిలో భారత్‌ ప్రవేశించిన‌ త‌రువాత‌ న్యూయార్క్ పర్యటనకు తొలిసారిగా వ‌చ్చిన‌ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి ఆహ్వానించారు.

జైశంకర్ అమెరికా పర్యటన మే 28 వరకు ఉంటుందని విదేశాంగ శాఖ గతవారంలో తెలిపింది. విదేశాంగ మంత్రి జైశంక‌ర్ న్యూయార్క్‌లోని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌ను కలుసుకోనున్నారు. అనంత‌రం వాషింగ్టన్ డీసీలో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో చర్చించనున్నారు. అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన క్యాబినెట్ సభ్యులు, సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను కూడా జైశంక‌ర్ కలుసుకోనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+