అమ్మ దీవెనలతో ఎదిగిన విజయ్ కాంత్, అదే జయలలితతో అసెంబ్లీలో ఢీకొట్టి ఏం అయ్యాడంటే !
కరోనా మహమ్మారి ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (డీఎండీకే) అధినేత విజయకాంత్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంలో తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి జయలలితతో విజయ్ కాంత్ కు జరిగిన గొడవకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకాలను అన్నాడీఎంకే పార్టీ నాయకులు, డీఎండీకే పార్టీ నేతలతో పాటు తమిళనాడు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.
2011 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి (పొత్తు) పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. ఆ సమయంలో డీఎంకే కనుమరుగైంది. అన్నాడీఎంకే పార్టీ కూటమిలో పోటీ చేసిన ఏకైక ప్రతిపక్ష పార్టీ డీఎండీకే పార్టీ. 2012లో డీఎంకే ఎమ్మెల్యేలు పాల, కరెంటు ధరల పెంపుపై శాసనసభలో ఆందోళన చేశారు. డీఎంకే ఎమ్మెల్యే చంద్రకుమార్ ఆ సందర్బంలో ధరల పెరిగాయనే ప్రశ్న లేవనెత్తారు.

ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధిస్తుందని ధైర్యం మీకు ఉందా, మీకు అధికారం, సత్తా ఉంటే ఒంటరిగా పోటీ చేసి చూడండి అని విజయకాంత్ వైపు చూసి ఆవేశంగా అన్నారు. అప్పటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో మౌనంగా ఉన్న విజయకాంత్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా గెలుస్తుందో మాకు తెలుసు అని అప్పటి తమిళనాడు సీఎం జయలలతను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దీంతో జయలలిత, విజయకాంత్ ల మధ్య అసెంబ్లీలో వాదన తీవ్రమైంది. అన్నాడీఎంకే కూటమిలో ఎవరు గెలుస్తారనే చర్చ జోరుగా సాగింది. జయలలిత, విజయకాంత్‌లు నేరుగా వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో జయలలిత మాట్లాడుతూ డీఎండీకేతో ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకున్నానని అని ఇప్పుడు తాను చింతిస్తున్నాను, ఆ పార్టీతో ఇక ముందు ఎలాంటి సందర్బంలో పొత్తు ఉండబోదు, డీఎండీకేకి కావాల్సిన లాభాలు నా నుంచి వచ్చాయని, అధికారం వచ్చిన తరువాత ఇప్పుడు ఆ పార్టీ దాని దారిలో అది వెలుతోందని జయలలిత మండిపడ్డారు.

దీంతో విజయకాంత్, డీఎండీకే ఎమ్మెల్యేలకు, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విజయకాంత్ సహా డీఎండీకే పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఈ వివాదంలో జయలలితపై విజయకాంత్ అతని అక్కసు బయటపెట్టారని రాజకీయ నాయకులు అంటున్నారు. అయితే ఆ తర్వాత జయలలితను తాము కించపరచలేదని విజయ్ కాంత్ తో పాటు డీఎండీకే పార్టీ నాయకులు వివరణ ఇచ్చారు. అయితే జయలలిత మాత్రం విజయ్ కాంత్ తో పాటు డీఎండీకే పార్టీ నాయకులను దూరం పెట్టేశారు.
అయితే ఇప్పటి వరకు జయలలిత, విజయ్ కాంత్ ల మధ్య జరరిగిన ఆ గొడవ అసెంబ్లీ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయింది. ఎందుకంటే అధికార పార్టీ నాయకుల మధ్య ఆ గొడవ జరగడం కలకలం రేపింది. జయలలితతో గొడవ పెట్టుకున్న తరువాత విజయ్ కాంత్ ప్రభావం దెబ్బ తినిందని తమిళనాడు రాజకీయ నాయకులు అంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఒకానొక సమయంలో విజయకాంత్ ఆరోగ్యం బాగా దెబ్బతింది. విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నా విజయ్ కాంత్ పరిస్థితి మామూలు స్థితికి రాలేదు.

2020 కరోనా ఇన్ఫెక్షన్‌తో విజయ్ కాంత్ బాధపడ్డారు. అయితే విజయ్ కాంత్ ఆరోగ్యపరంగా అన్ని సవాళ్లను ఎదుర్కొని వాటిని అధిగమించాడు. అయితే కొద్దిరోజుల క్రితమే విజయ్ కాంత్ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పుకార్లు వ్యాపించాయి. ఈ రూమర్ అబద్ధమని నిరూపించడానికి విజయ్ కాంత్ డీఎండీకే పార్టీ కార్యకర్తలను స్వయంగా కలిశారు. అయితే విజయ్ కాంత్ మళ్లీ ఆస్పత్రి పాలయ్యాడు.
అతనికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ సందర్భంలో గురువారం వేకువజామున నుండి చాలా మంది పార్టీ కార్యకర్తలు, విజయ్ కాంత్ అభిమానులు ఆయన ఇంటి ముందు గుమిగూడారు. ఆసుపత్రి ఎదుట కూడా పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేశారు. అనంతరం విజయ్ కాంత్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో విజయ్ కాంత్ అభిమానులు, సినీ ప్రముఖులు, డీఎండీకే పార్టీ కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు. స్టార్ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా విజయ్ కాంత్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications