గుజరాత్‌లో భూకంపంం 4.3 తీవ్రత నమోదు, భయంతో జనం పరుగులు

గుజరాత్ రాష్ట్రంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌కోట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో ఆదివారం భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం రాజ్‌కోట్‌లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది.

మధ్యాహ్నం 3:21 గంటలకు రాజ్‌కోట్‌కు 270 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు. నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారు.

Earthquake Of Magnitude 4.3 Hits Rajkot, Gujarat

అయితే, ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు.

గత వారం రెండు రోజుల్లో గుజరాత్‌లోని అమ్రేలి ప్రాంతంలో మూడు తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) అధికారి ఒకరు తెలిపారు.

కాగా, ఇటీవల టర్కీ-సిరియా దేశాల్లో సంభవించిన తీవ్ర భూకంపంతో భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకు 50వేల మందికిపైగా పౌరులు మృతి చెందారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+