ఈస్టర్ సండే: బోసిపోయిన చర్చిలు: యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా లైవ్‌లో: మోడీ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పరిస్థితులు కొనసాగుతోన్న నేపథ్యంలో.. ఈస్టర్ సండే నాడు చర్చిలో బోసిపోయాయి. ఈస్టర్ సండే వంటి పవిత్ర రోజు భక్తులతో కిటకిటలాడాల్సిన చర్చిలు కళ తప్పాయి. లాక్‌డౌన్ ఉండటం వల్ల క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలకు హాజరు కాలేదు. కాలు బయట పెట్టలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మత పెద్దలు చర్చిల నుంచి యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను నిర్వహిస్తున్నారు. దీనితో ఇళ్లల్లో ఉంటూనే ఈస్టర్ సండే ప్రార్థనల్లో పాల్గొంటున్నారు.

Recommended Video

    India Lockdown : Churches in Across India Remain Shut On Easter

    ఇదివరకు జనతా కర్ఫ్యూ, పామ్ సండే, గుడ్‌ఫ్రైడే వంటి సందర్భాల్లోనూ క్రైస్తవులు చర్చిలకు వెళ్లలేదు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ పరిస్థితులను గౌరవిస్తూ.. ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈస్టర్ సండే నాడు కూడా చర్చిల్లో సామూహిక ప్రార్థనలను రద్దు చేశారు. దాని స్థానంలో యుట్యూబ్ లైవ్ ద్వారా ప్రార్థనలను కొనసాగిస్తున్నారు. ఎవరి ఇళ్లల్లో వాళ్లు.. యుట్యూబ్‌లో లైవ్‌లో ప్రార్థనలు చేసుకోవాలంటూ చర్చి ఫాదర్లు ఇదివరకే జారీ చేశారు.

    Easter Sunday prayers from churches live-streamed on social media platforms due to Covid-19

    ఏపీ, తెలంగాణలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇవే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని అన్ని ప్రధాన చర్చిలు నిర్మానుష్యంగా మారిపోయాయి. చర్చి ఫాదర్లు, ఒకరిద్దరు వారి వ్యక్తిగత సహాయకులు మినహా మరెవ్వరూ చర్చిల్లో కనిపించలేదు. ఈస్టర్ సండే ప్రార్థనలను లైవ్ స్ట్రీమ్ చేశారు. మధ్యాహ్నం వరకూ నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగుతాయని సికింద్రాబాద్ చర్చి పాస్టర్ తెలిపారు.

    ఈస్టర్ సండే సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రైస్తవులకు శుభాకాంక్షలను తెలియజేశారు. భయానక కరోనా వైరస్‌ను రూపుమాపే శక్తియుక్తులను జీసస్ సమస్త ప్రజలకు ప్రసాదించాలని మోడీ అకాంక్షించారు. వైరస్ రహిత భూమండలాన్ని త్వరలోనే చూస్తామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేదల అభ్యున్నతి కోసం ఏసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన జీవితం ఆదర్శప్రాయమని అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+