వివాదాలు, బిహార్ ఎన్నికల వేళ.. ఈసీ ఆ నిర్ణయం

ECI: కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రస్తుతం వివాదాలను ఎదుర్కొంటోంది. ఫేక్ ఓటర్లు, ఈవీఎం ట్యాంపరింగ్, బిహార్ లో ఓటర్ల జాబితా సమీక్ష వంటి అంశాల ఈసీని చుట్టుముట్టాయి. ప్రతిపక్షాల తీవ్రస్థాయిలో ఆరోపణలను ఎదుర్కొంటోంది. అదే సమయంలో బిహార్ ఎన్నికల కసరత్తు చేపట్టింది.

ఈ పరిణామాల మధ్య ఈసీ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఎన్నికల సిబ్బందికి చెల్లించే గౌరవ వేతనాన్ని రెట్టింపు చేసింది. అలాగే- రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు కూడా గౌరవ వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి.. రివైజ్డ్ వేతనాలతో కూడిన అధికారిక ప్రకటన కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది.

EC doubles the Remuneration also decides to give honorarium to RO and EROs

పోలింగ్ స్టేషన్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు మొదలుకుని ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్క సిబ్బందికీ.. ఈ వేతన పెంపు వర్తిస్తుంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు, బీఎల్ఓ సూపర్ వైజర్లు, ఇతర సిబ్బందికీ పెంచిన గౌరవ వేతనం అందుతుంది. దీనితో పాటు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కూడా గౌరవ వేతనాన్ని అందుకుంటారు.

ప్రస్తుతం బూత్ లెవెల్ ఆఫీసర్ కు 6,000 రూపాయల గౌరవ వేతనం అందుతోంది. ఈ మొత్తం రెట్టింపు అయింది. 12,000 రూపాయలకు చేరింది. ఓటర్ల జాబితా రివిజన్ విధుల్లో పాల్గొనే బీఎల్ఓకు ప్రస్తుతం 1,000 రూపాయలను ఇన్సెంటివ్ గా అందజేస్తోంది ఈసీ. ఇక ఈ మొత్తం 2,000 రూపాయలకు పెంచింది.

బూత్ లెవెల్ సూపర్ వైజర్ కు ప్రస్తుతం 12,000 రూపాయల గౌరవ వేతనాన్ని చెల్లిస్తోంది ఈసీ. ఇక ఈ మొత్తం 18,000 రూపాయలకు పెరిగింది. వీరితో పాటు రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు కూడా గౌరవ వేతనాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు వీరికి ఆ సౌకర్యం లేదు. ఇకపై రిటర్నింగ్ అధికారి 30,000లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి 25,000 రూపాయల గౌరవ అందుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+