మమత బెనర్జీ తృణమూల్ కు నూతన ఎన్నికల గుర్తు: ఈసీ బిగ్ స్టెప్

పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష పార్టీ తృణమూల్ కాంగ్రెస్ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్గ కుమ్ములాటలతో సతమతమౌతోన్న ఈ పార్టీ ఎన్నికల గడ్డి పువ్వును ఫ్రీజ్ చేసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మమత బెనర్జీ వర్గానికి అసలు తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల గుర్తును రద్దు చేసింది. దీని స్థానంలో మరో కొత్త గుర్తును కేటాయించింది.

అది.. ఫుట్ బాల్ ప్లేయర్ సింబల్. ఓ ప్లేయర్ ఫుట్ బాల్ ఆడుతున్న గుర్తును ఎలక్షన్ సింబల్ గా కేటాయించింది ఈసీ. అలాగే.. తృణమూల్ కాంగ్రెస్ లో మార్పులు కూడా చోటు చేసుకున్నాయి. ఇకపై మమత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్.. గా మారిందీ పార్టీ. ఇదే పేరును తాము అధికారికంగా గుర్తించినట్లు ఈసీ వెల్లడించింది. తిరుగుబాటు వర్గ నేత రితబ్రత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు ఎన్వలప్ గుర్తును ఇచ్చింది. డెమోక్రటిక్ తృణమూల్ కాంగ్రెస్ గా గుర్తించినట్లు తెలిపింది.

EC Gives Football Player Symbol to Mamata Banerjee Trinamool Rebel Faction Gets Envelope for Bypoll

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ ఈ రెండు వర్గాల అంతర్గత వైరం.. ఈసీ తాజా నిర్ణయంతో కీలక మలుపు తిరిగినట్టయింది. బెంగాల్ రాజకీయాల్లో క్రీడలు.. ప్రత్యేకించి ఫుట్‌బాల్‌కు ఉన్న విపరీతమైన క్రేజ్ దృష్ట్యా ఈ గుర్తు మమతా బెనర్జీ వర్గానికి ఎంతగానో కలిసివచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు భావిస్తోన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమత బెనర్జీ.. కి మూడోసారి అధికారాన్ని ఇచ్చిందీ క్రేజ్.

మమత బెనర్జీకి మంచి ఛాన్స్- బెంగాల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు వీళ్లే
మమత బెనర్జీకి మంచి ఛాన్స్- బెంగాల్ ఉప ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు వీళ్లే

అప్పట్లో ఆమె ఖేలా హొబే పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల ప్రచార సమయంలో గాయపడ్డారు మమత. కట్టు కట్టిన కాలి పాదాన్ని ఫుట్ బాల్ పై ఉంచిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వీటికి ఖేలా హొబే అనే క్యాప్షన్ జత అయింది. అప్పటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కు భారీ విజయాన్ని కట్టబెట్టిందీ క్యాంపెయిన్. ఇప్పుడు అదే ఖేలా హొబే ఫొటోను ఎన్నికల అధికార గుర్తుగా దక్కించుకుంది మమత తృణమూల్. ఇది ఆమెకు కలిసి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ గుర్తులతోనే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందీ రెండు వర్గాలకు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+