ఓటేసిన తర్వాత రోడ్ షోనా?: మోడీ, ఈసీలపై కాంగ్రెస్ నిప్పులు(వీడియో)
Recommended Video

అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలో గురువారం రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్ర వద్ద తన ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. కారులో ఎక్కి.. ఓటు వేసినట్లు గుర్తుగా వేలును చూపుతూ రోడ్ షోగా రావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఓ వైపు ఎన్నికలు జరుగుతుండగా ఇలాంటి ర్యాలీలో నిర్వహించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్ గుజరాత్ ఇంఛార్జ్ అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.

మరో కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జీవాలా.. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం మీడియాతో మాట్లాడటాన్ని ఎందుకు ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవడం లేదని మండిపడ్డారు. మోడీ బహిరంగా ఇలా ర్యాలీగా వెళుతుంటే ఈసీ ఏం చేస్తోందని, అదొక తోలు బొమ్మలా మారిపోయిందని ఆరోపించారు. తమకు ఈ(మోడీ) రోడ్ షోకు సంబంధించి ఫిర్యాదు అందిందని ఈసీ పేర్కొంది. పరిశీలన తర్వాత స్పందిస్తామని తెలిపింది.
#WATCH Ahmedabad: PM Narendra Modi leaves after casting his vote at booth number 115 in Sabarmati's Ranip locality. #GujaratElection2017 pic.twitter.com/cRqbmApgMv
— ANI (@ANI) December 14, 2017
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఇలా ర్యాలీలు చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తుంటే ఎన్నికల సంఘం కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. కాగా, ఒక రోజు క్రితం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో ఈసీ ఆయనకు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications