వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బొందుగాళ్లు వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే, మరోసారి రిపిట్ కాకుండా చూసుకొండి : కేసీఆర్‌కు ఈసీ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన 'హిందుగాళ్లు బొందుగాళ్లు' కామెంట్ పై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. హిందువులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేనని స్పష్టంచేసింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిందకే వస్తోందని పేర్కొంది.

చిచ్చు సరికాదు

చిచ్చు సరికాదు

ఓట్ల కోసం కుల, మతాల మధ్య చిచ్చుపెట్టినట్టుగా పరిగణిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. మొదటిసారి కాబట్టి హెచ్చరించి వదిలేస్తున్నామని వెల్లడించింది. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటన రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. దీనికి సంబంధించి కాసేపటి క్రితం ఈసీ ఓ సర్క్యులర్ జారీచేసింది. అయితే ఈసీ హెచ్చరికలపై కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు స్పందించాల్సి ఉంది.

బొందుగాళ్లు కామెంట్స్

బొందుగాళ్లు కామెంట్స్

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి ప్రచార శంఖారావం పూరించారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బీజేపీని ఉద్దేశించి 'హిందుగాళ్లు బొందుగాళ్లు‘ అని కామెంట్ చేశారు. బీజేపీ నేతలు గుళ్లు, గోపురాలు తిరుగుతరా ? మిగతావారు ఆలయాలకు వెళ్లారా అని ప్రశ్నించారు. మేం తిరుపతి, ఎములాడ వెళ్లమా ... వాళ్లేనా హిందుగాళ్లు బొందుగాళ్లు అని వ్యాఖ్యానించారు.

కంప్లైంట్ .. వివరణ ... వార్నింగ్

కంప్లైంట్ .. వివరణ ... వార్నింగ్

కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఆరెస్సెస్ నేత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ ను వివరణ కోరగా .. లిఖితపూర్వకంగా ఎక్స్ ప్లానేషన్ కూడా ఇచ్చారు. అయితే ఆయన వివరణతో సంతృప్తి చెందని ఈసీ .. కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చింది. బొందుగాళ్లు వ్యాఖ్యలు తప్పని .. మరోసారి రిపీట్ కానియొద్దని తేల్చిచెప్పింది.

English summary
The Central Election Commission has taken serious note of the 'Hindutva Pilligars' comment made by Telangana CM KCR during the general election. The comments made against the Hindus clearly stated that they were wrong. It states that the election code is in violation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X