వాటిపై దృష్టి సారించాలి- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

చెన్నై: ఇంకొన్ని గంటల్లో యావత్ దేశం 77వ స్వాతంత్ర్య దినోత్సవాలను జరుపుకోనుంది. దేశం మొత్తం త్రివర్ణ పతాకాలు రెపరెపలాడబోతోన్నాయి. నేషన్ ఫస్ట్- ఆల్వేస్ ఫస్ట్.. అనే థీమ్‌తో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోనున్నారు దేశ ప్రజలందరూ. జాతీయ సమగ్రత, దేశాభివృద్ధికి సంకేతంగా ఈ థీమ్‌ను రూపొందించింది ప్రభుత్వం

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మిలటరీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అధికారులు.. ఈ కార్యక్రమాలకు హాజరవుతారు.

economic empowerment of women is being given special focus, says president draupadi murmu

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాస్య శృంఖలాల నుంచి దేశాన్ని విముక్తం చేయడానికి బలిదానాలు, ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను దేశ ప్రజలు గౌరవించుకుంటోన్నారని. వారి త్యాగాల వల్లే దేశం స్వాతంత్ర్యాన్ని పొందగలిగిందని అన్నారు.

మాతంగిని హజ్రా, కనక్లత బారువా వంటి వెలుగు చూడని ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను రాష్ట్రపతి స్మరించుకున్నారు. భరతమాత కోసం వారు తమ ప్రాణాలను అర్పించారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చిన మహనీయులను గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.

ప్రస్తుతం భారత్.. సరైన దిశలో ప్రయాణిస్తోందని, అంతర్జాతీయ దేశల స్థాయికి చేరుకుంటోదని ద్రౌపది ముర్ము అన్నారు. ప్రపంచదేశాలన్నీ కూడా తమ దృష్టిని భారత్ వైపు సారించాయని గుర్తు చేశారు. జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. జీ20 సమ్మిట్‌తో ప్రపంచ దేశాలకు భారత్.. ఓ దిశా నిర్దేశం చేయగలుగుతుందని అన్నారు.

మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి పెట్టడం సంతోషాన్ని కలిగిస్తోందని ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. కుటుంబం, సమాజంలో మహిళల స్థానాన్ని ఇది బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వవాలని, వారంతా ధైర్యంగా అన్ని సవాళ్లను అధిగమించి జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన తోడ్పాటును అందించాలని సూచించారు.

2020లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం వల్ల మార్పులు మొదలయ్యాయని, వాటి ఫలితాలను అందుకోబోతున్నామని రాష్ట్రపతి చెప్పారు. రాబోయే కాలంలో దేశంలో అనేక విప్లవాత్మక మార్పులకు ఈ జాతీయ విద్యా విధానం శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. ప్రపంచంలో అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, ఇక తన తదుపరి లక్ష్యంగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించాల్సి ఉందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+