ఈడీ డైరెక్టర్‌పై కేంద్రం వేటు: వేగం పెంచినందుకేనా..!

న్యూఢిల్లీ: దేశంలో అర్ధిక సంబంధిత నేరాలపై కొరడా ఝుళిపిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేంద్రం షాకిచ్చింది. ఆ సంస్ధ డైరెక్టర్ రాజన్ ఎస్ కటోష్‌ను పదవి నుంచి తొలగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (ఏసీసీ) బుధవారం అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ప్రస్తుతం స్పెషల్ డైరెక్టర్‌గా ఉన్న కర్నాల్ సింగ్‌కు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. కర్నాల్ సింగ్‌ కేంద్రపాలిత ప్రాంతాల కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ అధికారి. రెవెన్యూ విభాగం పరిధిలో ఈడీలో స్పెషల్ డైరెక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ED Director Rajan S Katoch removed from service

కర్నాల్ సింగ్ మూడు నెలల పాటు ఈడీ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు. కటోష్ పదవీ కాలం అక్టోబరు 31 వరకు ఉంది. అయినప్పటికీ, ఆయన్ని తప్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాలు తెలియరాలేదు.

కర్నాల్ సింగ్‌ నియామకంతో కటోష్ ఆ బాధ్యతల నుంచి వైదోలగనున్నారు. దేశవ్యాప్తంగా పలు సంచలన కేసుల దర్యాప్తులో ఈడీ వేగం పెంచిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+