పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కామ్: ఛార్జీషీట్ దాఖలు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ లో ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీపై ఈడీ గురువారం నాడు ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. సుమారు 14 వేల కోట్లకు పైగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో అవతవకలు చోటు చేసుకొన్నాయి.
ప్రముఖ వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేశారని సీబీఐ గుర్తించింది. ఈ విషయం వెలుగు చూసిన తర్వాత నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయాడు. అతడి కోసం భారత ప్రభుత్వం గాలింపు చర్యలను చేపట్టింది. విజయ్ మాల్యా తరహలోనే విదేశాల్లోనే నీరవ్ మోడీ స్థిరపడే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం కూడ లేకపోలేదు.

ఇదిలా ఉంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించిన విషయమై ఈడీ తొలి ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే సీబిఐ చార్జీషీట్ దాఖలు చేసింది.ఈ చార్జీషీటులో కొందరు బ్యాంకు అధికారుల పేర్లను సీబీఐ చేర్చింది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంకు కేసుకు సంబంధించి నీరవ్ మోడీ సహా పలువురిపై ఈ ఛార్జీషీటులో పేర్లు నమోదు చేసినట్టు సమాచారం.
తాజాగా ఈడీ ఈ కేసులో తొలి ఛార్జీషీటును వేసింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 14వతేదిన పంజాబ్ నేషనల్ బ్యాంకులో సుమారు 14 వేల కోట్ల మేర కుంభకోణం వాటిల్లిందని ఆ బ్యాంక్ ప్రకటించింది.
నీరవ్ మోడీ, మెహల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన బోగస్ ఎల్ఓయూలను ఉపయగించి మోసానికి పాల్పడ్డారని బ్యాంకు ప్రకటించింది.అయితే బ్యాంకు ఈ ప్రకటన చేయడానికి నెల రోజులకు ముందే నీరవ్ మోడీ దేశం విడిచివెళ్ళిపోయాడు.












Click it and Unblock the Notifications