ప్రకాష్ రాజ్ కు ఈడీ షాక్; 100 కోట్ల పోంజీ స్కామ్ లో నోటీసులు!!
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు షాక్ ఇచ్చింది. 100 కోట్ల రూపాయల పోంజీ స్కామ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ కు నోటీసులు జారీ చేసింది. వంద కోట్ల రూపాయల పోంజీ స్కాం కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో చెన్నైలో వచ్చేవారం ప్రజాష్ రాజ్ విచారణకు రావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన నోటీసులో పేర్కొంది.
తిరుచ్చికి సంబంధించిన ఒక జువెలరీ గ్రూపు పై నవంబర్ 20వ తేదీన దాడిచేసి 23. 70 లక్షల లెక్క చెప్పని నగదు మరియు కొన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తిరుచ్చికి సంబంధించిన ఈ ఆభరణాల సంస్థకు ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా ఉన్నారు.

ప్రణవ్ జూవెలర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ప్రకాష్ రాజ్ ను ఈ సంస్థకు సంబంధించిన వ్యవహారాలలో ఈడీ అధికారులు విచారించనున్నారు. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసి విచారణ జరుపుతోంది.
బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుండి 100 కోట్ల రూపాయలను ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని చూపించి, పెట్టుబడులు రాబట్టారని పేర్కొన్నారు. ఈ జువెలర్స్ కు యాడ్స్ చేసే ప్రచారకర్తగా వ్యవహరించిన ప్రకాష్ రాజ్ వారి నుంచి ఫీజు తీసుకున్నారు.
ఈ క్రమంలో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారించనుంది. ప్రణవ్ జూవెలర్స్ బోగస్ బోగస్ గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ స్కీం కు సంబంధించిన కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు ప్రచార కర్తగా ఉన్న ప్రకాష్ రాజ్ కు చేసిన చెల్లింపుల వివరాలు ఇవ్వాల్సిందిగా ఆయనను కోరారు. ప్రకాష్ రాజ్ కు ఈడి అధికారులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications