ప్రమాదానికి కొద్ది గంటల ముందే బిగ్ హింట్.. అచ్చం అలాగే జరిగింది.. షాకింగ్ ఫోటోలు బయటకు..!
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిపోయిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా 12 మంది సిబ్బంది దుర్మరణం చెందారు. ఈ ఘటన యావత్ భారత్ నే కాకుండా ప్రపంచ దేశాలను షాక్ కు గురిచేసింది. ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానం అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని బీజీ వైద్య కళాశాల భవనంపై పడటంతో మరో 24 మంది వైద్య విద్యార్థులు మృతి చెందారు.
అయితే ఇందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎయిరిండియా విమానం ఘటన కు సంబంధించి గుజరాత్ లోని ప్రముఖ పత్రిక మిడ్- డే న్యూస్.. తన ఫ్రంట్ పేజీలో ఓ చిత్రాన్ని ప్రచురించింది. భవనంలోంచి ఎయిరిండియా విమానం దూసుకొస్తున్నట్లు ఆ చిత్రం ఉంది. అయితే ఈ పత్రిక ప్రచురించిన కొద్ది గంటల ముందే అచ్చం ఇదే ఘటన జరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో ఎయిరిండియా విమానం కూడా అచ్చం ఆ చిత్రంలో ఉన్నట్లు ఓ వైద్య కళాశాల భవంతిలోకి దూసుకెళ్లింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
అయితే ఫాదర్స్ డే సందర్భంగా కిడ్జానియా పేరుతో ఓ ఫన్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికోసం వేసిన ఎయిర్ ఇండియా యాడ్ ఇదేనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే అచ్చం ఇలానే విమానం కుప్పకూలడంతో ఇదే యాదృచ్ఛికం అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆయనతోపాటు వైమానిక శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని క్షమించేది లేదని పేర్కొన్నారు.
మరోవైపు జూన్ 13 ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రమాదంలో బతికి బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేశ్ ను ఆయన పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.












Click it and Unblock the Notifications