CM: షిండే, నీ కొడుకును మా పార్టీ టిక్కెట్ తో ఎంపీ చేశావు, నా కొడుకుతో నీకెందుకు సమస్య, సీఎం !

ముంబాయి/ గుహవాటి: మా తాత బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీలో నేను సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగానని, మాకు అన్ని రకాలుగా శివసేన కార్యకర్తులు, ప్రజలు అండగా ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మా కుటుంబ సభ్యులు శివసేన పార్టీలో ఎదగకూడదు అని చెబుతున్న రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే అతని కొడుకును ఎలా ఎంపీ చేశారని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారని తెలిసింది. నా కొడుకుతో ఏక్ నాథ్ షిండేకి ఏమి సమస్య వచ్చిందో నాకు మాత్రం అర్థం కావడం లేదని ఉద్దవ్ ఠాక్రే విచారం వ్యక్తం చేశారని తెలిసింది. శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే మనకు ద్రోహం చేసిన ఏక్ నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలకు కచ్చితంగా బుద్ది చెప్పాలని శివసేన నాయకులకు సూచించారని తెలిసింది.

 జిల్లా అధ్యక్షులతో సీఎం సమావేశం

జిల్లా అధ్యక్షులతో సీఎం సమావేశం

శుక్రవారం ముంబాయిలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే నివాసంలో శివసేన పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మీడియాను దూరం పెట్టారు. శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చాలా ఆవేదనతో ప్రసంగించారని తెలిసింది.

 మా తాత పెట్టిన పార్టీ

మా తాత పెట్టిన పార్టీ

మా తాత బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీలో నేను సామాన్య కార్యకర్త స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదిగానని, మాకు అన్ని రకాలుగా శివసేన కార్యకర్తులు, ప్రజలు అండగా ఉన్నారని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారు. శివసేన మా సొంత పార్టీ అయినా మొదటి నుంచి మేము పదవుల కోసం పాకులాడలేదని, ఆ విషయం శివసేన కార్యకర్తలకు కూడా తెలుసు అని సీఎం ఉద్దవ్ ఠాక్రే అన్నారని తెలిసింది.

 ఏక్ నాథ్ షిండే కొడుకు శివసేన ఎంపీ

ఏక్ నాథ్ షిండే కొడుకు శివసేన ఎంపీ

రెబల్ మంత్రి ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కల్యాణ్ లోక్ సభ నియోజక వర్గం నుంచి శివసేన పార్టీ టిక్కెట్ మీద పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు మొత్తం ఏక్ నాథ్ షిండే చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే పేరు తెరమీదకు వచ్చింది.

 నా కొడుకుతో ఏమిటి సమస్య ?, నీ కొడుకు ఎంపీ కాదా

నా కొడుకుతో ఏమిటి సమస్య ?, నీ కొడుకు ఎంపీ కాదా

మా కుటుంబ సభ్యులు శివసేన పార్టీలో ఎదగకూడదు అని చెబుతున్న రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండే అతని కొడుకు శ్రీకాంత్ షిండేని మా పార్టీ టిక్కెట్ తీసుకుని ఎలా ఎంపీ చేశారని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారని తెలిసింది. నా కొడుకు ఆదిత్య ఠాక్రేతో ఏక్ నాథ్ షిండేకి ఏమి సమస్య వచ్చిందో నాకు మాత్రం అర్థం కావడం లేదని ఉద్దవ్ ఠాక్రే విచారం వ్యక్తం చేశారని తెలిసింది.

 నా పేరు, శివసేన పేరు వాడకుండా ఎంతదూరం వెలుతారు

నా పేరు, శివసేన పేరు వాడకుండా ఎంతదూరం వెలుతారు

శివసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో కార్యకర్తకు ఉద్దవ్ ఠాక్రే పలు సూచనలు చేశారని సమాచారం. శివసేన పార్టీకి, మనకు ద్రోహం చేసిన ఏక్ నాథ్ షిండేతో పాటు కొందరు ఎమ్మెల్యేలకు కచ్చితంగా బుద్ది చెప్పాలని శివసేన నాయకులకు సూచించారని తెలిసింది. ఠాక్రే అనే పేరు, శివసేన పేరు వాడకుండా మీరు ఎంతదూరం వెలుతారో మేము చూస్తామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే రెబల్ నాయకుడు ఏక్ నాథ్ షిండేని ఉద్దేశించి అన్నారని ప్రముఖ జాతీయ మీడియా తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+