MH Elections: షిండే పై కూటమి చేతికి కొత్త అస్త్రం..!!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్డీఏ - ఇండియా కూటముల నేతల సీట్ల సర్దుబాటు పైన చర్చలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం పైన కసరత్తు ప్రారంభించారు. ఇదే సమయంలో సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే ఆలయంలోని గర్భగుడి ప్రవేశం కొత్త వివాదంగా మారింది.

షిండే కుమారుడి వివాదం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే కుమారుడు వివాదంలో చిక్కారు. శ్రీకాంత్ షిండే తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉజ్జైని నగరంలో ఉన్న మహాకాళేశ్వర దేవాలయంలో అక్కడి నిబంధనలను వ్యతిరేకంగా గర్భగుడిలో ప్రవేశించారు. అక్కడ ఎవరికీ గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. కానీ, సీఎం షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సతీ సమేతంగా గర్భగుడిలోకి ప్రవేశించారు.ఎంపీ అయిన శ్రీకాంత్ షిండే తన భార్య, ఇద్దరు పిల్లలతో మహాకాళేశ్వర ఆలయం గర్భగుడిలో ప్రవేశించి ప్రత్యేక పూజలు చేశారు. దీని పైన ఇప్పుడు ఇండియా కూటమి నేతలు ఆయన్ను టార్గెట్ చేసారు.

Eknath Shinde s son Shrikant gets backlash after entering Mahakaleshwar Temple s sanctum despite ban

వీడియో వైరల్
ముఖ్యమంత్రి కుమారుడు దేవాలయ గర్భగుడిలో ప్రవేశించి.. పూజలుే చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు ఏడాది కాలంలో మహాకాలేశ్వర ఆలయంలోని గర్భగుడి లో నిషేధం అమలవుతోంది. నిషేధం ఉండగా గర్భగుడిలోకి శ్రీకాంత్ షిండేను ఎలా అనుమతిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. సామాన్యులు దర్శనం కోసం గంటల పాటు నిరీక్షిస్తుంటే షిండే వ్యవహార శైలి సామాన్య భక్తుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని విమర్శలు చేస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లాంగాల్లో ఒకటిగా మహాకాలేశ్వర ఆలయం ఉంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు.

Eknath Shinde s son Shrikant gets backlash after entering Mahakaleshwar Temple s sanctum despite ban

వారిని నచ్చదు
ఈ వివాదం పైన కమిటీ ఛైర్మన్ గా వ్యవహరించే ఉజ్జైని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ స్పందించారు. గర్భగుడిలోకి ఎవరికీ ప్రవేశం లేదన్నారు. అనుమతి లేకుండా ఎంపీ లోపలకు వెళ్లారని చెప్పారు. దీని పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు వెల్లడించారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. అయితే, శ్రీకాంత్ షిండే మాత్రం తాము ఆలయాలకు వెళ్తే ప్రతిపక్షాలకు అలర్జీ వస్తుందన్నారు. ఆలయాలకు వెళ్లే వారిని ఆపటానికి ప్రయత్నాలు చేస్తారని ఇండియా కూటమి నేతల పైన మండిపడ్డారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+