ఒక్క రాంగ్ కాల్ తో ముసలావిడ లైఫ్ ఖతం.. రూ. 20 కోట్లు మాయం.. సీబీఐ అని చెప్పి..
ప్రస్తుతం సైబర్ నేరాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్న నేరాలకూ అంతు లేకుండా పోయింది. అలాంటి ఓ షాకింగ్ ఘటన సౌత్ ముంబైలో జరిగింది. సైబర్ స్కామర్ల పంజాకు చిక్కిన ఓ 86 ఏళ్ల వృద్ధురాలు వారి మాయ మాటలకు భయపడి ఏకంగా రూ. 20 కోట్లు పోగొట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏం జరిగింది..?
డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో ముంబైకి చెందిన 86 ఏళ్ల వృద్ధురాలు చిక్కింది. కేటుగాళ్లు ఫోన్ కాల్స్ తో భయబ్రాంతులకు గురి చేయడంతో గత ఏడాది డిసెంబర్ 26 నుంచి ఈ ఏడాది మార్చి 3 మధ్యకాలంలో దాదాపు రూ. 20 కోట్లు మోసపోయింది. సీబీఐ ఆఫీసర్లుగా నమ్మించి ఆ వృద్ధురాలిని అయోమయానికి గురి చేశారు. రెండు నెలలపాటు ఇంట్లోనే ఉండాలని షరతులు విధించి ప్రతిరోజూ ప్రతి మూడు గంటలకోసారి ఫోన్ కాల్స్ చేస్తూ.. లొకేషన్ చెక్ చేస్తూ హింసించారు. డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించి డిసెంబర్ 26 నుంచి మార్చి 3 మధ్య కాలంలో ఆమె నుంచి ఏకంగా రూ. 20 కోట్లు స్వాహా చేశారు. దీంతో వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రూ. 77 లక్షల వరకు తిరిగి తీసుకురాగలిగారు.

సీబీఐ ఆఫీసర్ గా నమ్మించి..
ఆ వృద్ధురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఓ వ్యక్తి.. తాను సీబీఐ ఆఫిసర్ గా ఆమెను నమ్మించాడు. తన ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంకు అకౌంట్ నుంచి మనీ ల్యాండరింగ్ జరిగిందని భయపెట్టాడు. ఇప్పటికే నీపై సీబీఐ కేసు నమోదు చేసిందని.. రెండు నెలలపాటు భయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని లేదంటే డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. తన పిల్లలనూ అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. దీంతో కేటుగాళ్లు చెప్పిన మాటలను ఆ ముసలావిడ నమ్మేసింది.
తనపై నమోదైన మనీ లాండరింగ్ కేసును మూసేస్తామని, కోర్టు ఫీజులని ఆమె నుంచి ఏకంగా రూ. 20 కోట్లు స్వాహా చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ మొత్తం సొమ్ము వివిధ ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications