కోడ్ దెబ్బ.. 540 కోట్ల జప్తు.. అత్యధికంగా ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో..!

ఢిల్లీ : ఎన్నికలు వచ్చాయంటే ధన, మద్య ప్రవాహానికి అడ్డే ఉండదు. ఆ క్రమంలో లోక్ సభ నామినేషన్ల చివరి రోజు నాటికి దేశవ్యాప్తంగా 540 కోట్ల రూపాయల నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్న యంత్రాంగానికి కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. అక్రమంగా తరలిస్తున్న నగదుతో పాటు విలువైన వస్తువులు, మద్యం, డ్రగ్స్ తదితర వస్తువులను సీజ్ చేశారు.

ఎన్నికల కోడ్ నేపథ్యంలో దేశమంతటా అధికారులు కొరడా ఝలిపించారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో అక్రమార్కుల గుట్టురట్టైంది. 540 కోట్ల రూపాయల మేర నగదు, ఇతర వస్తువులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 162 కోట్ల 93 లక్షల జ్యువెల్లరీ.. 143 కోట్ల 47 లక్షల నగదు.. 131 కోట్ల 75 లక్షల విలువైన డ్రగ్స్.. 89 కోట్ల 64 లక్షల విలువైన మద్యం.. 12 కోట్ల 20 లక్షల విలువైన ఇతర వస్తువులున్నాయి.

election code effect 540 crores seized across country

అధికారుల తనిఖీల్లో ఏపీ, యూపీ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా నగదు, ఇతర విలువైన వస్తువులు పట్టుబడ్డాయి. ఏపీలో 103 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు దొరకగా.. తెలంగాణలో 10 కోట్ల 9 లక్షల రూపాయల నగదు, 2 కోట్ల 4 లక్షల విలువ చేసే మద్యం, 2 కోట్ల 45 లక్షల విలువచేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+