ఇంజనీరింగ్ విద్యార్థిని కిడ్నాప్, ప్రాణాలకు తెగించింన యువతి, కారు స్టీరింగ్ !

ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిని కిడ్నాప్ చెయ్యడానికి విఫలయత్నం చేసిన ఘటన మైసూరు సమీపంలోని నంజనగూడు ప్రాంతంలో జరిగింది. మండ్యకు చెందిన రాధ అనే యువతి చామరాజనగర ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తు

బెంగళూరు: ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థినిని కిడ్నాప్ చెయ్యడానికి విఫలయత్నం చేసిన ఘటన మైసూరు సమీపంలోని నంజనగూడు ప్రాంతంలో జరిగింది. మండ్యకు చెందిన రాధ అనే యువతి చామరాజనగర ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తున్నది.

బుధవారం ఓ వ్యక్తి రాధకు ఫోన్ చేసి ఆమె చిన్నాన గొంతుతో మాట్లాడుతూ తాను నంజనగూడు దేవాలయం దగ్గరకు వస్తున్నాని నువ్వు అక్కడి వస్తే మాట్లాడాలని చెప్పాడు. అచ్చం సొంత చిన్నాన లాగే మాట్లాడటంతో రాధ నిజంగా నమ్మి దేవాలయం దగ్గరకు వెళ్లింది.

Engineering Student Kidnaping attempt at Mysuru in Karnataka.

మళ్లీ ఫోన్ చేసిన వ్యక్తి తాను రావడానికి ఆలస్యం అవుతోందని, స్నేహితుడి కారు పంపిస్తున్నానని, నువ్వు అందులో రావాలని చెప్పాడు. అదే సమయంలో స్కార్పియో కారు అక్కడికి వెళ్లింది. చిన్నాన ముందుగానే చెప్పిన కారు నెంబర్ ఉండటం, అందులో ఓ మహిళ కూడా ఉండటంతో రాధ నమ్మకంతో కారులో కుర్చునింది.

తనకు చిన్న పని ఉందని, మీరు వెళ్లాలని చెప్పిన మహిళ మార్గం మధ్యలో కారు దిగేసింది. కారులో కుర్చున్న రాధతో కలిసి నిందితులు వేరే మార్గంలో వేగంగా పోనిచ్చారు. రాధ కేకలు వేస్తున్నా నిందితులు పట్టించుకోలేదు. అయితే రాధ ప్రాణాలకు తెగించి కారు స్టీరింగ్ తిప్పేసింది.

కారు ఒక్క సారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడిపోయింది. వెంటనే కిడ్నాపర్లు రాధను కారులో వదిలేసి పారిపోయారు. రాధ గట్టిగా కేకలు వెయ్యడంతో సమీపంలోని గ్రామస్తులు ఆమెను రక్షించి నంజనగూడు గ్రామీణ పోలీసులకు అప్పగించారు. కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. మండ్య జిల్లాలో ఇటీవల అందమై నవవధువు (గృహిణి)ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వేశ్యవాటిక కేంద్రంలో విక్రయించడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+