కళ్యాణ మంటపం నుండి పెళ్లి కూతురు ఎస్కేప్

బెంగళూరు: ముహూర్తానికి మూడు గంటల ముందు పెళ్లి కుమార్తె అదృశ్యం అయిన సంఘటన కర్ణాటకలోని చామరాజనగర జిల్లా కోళ్లేగాళ పట్టణంలో జరిగింది. పెళ్లి కుమార్తె అదృశ్యం కావడంతో పెళ్లి రద్దు అయ్యింది. కోళ్లేగాళ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరుకు చెందిన రాజప్ప, లక్ష్మి దంపతులు కోళ్లేగాళ పట్టణం సమీపంలోని బస్తిపుర గ్రామం చేరుకుని నివాసం ఉంటున్నారు. వీరు ఇక్కడే సెటిల్ అయ్యారు. వీరి కుమార్తె ఆర్. కావ్య అలియాస్ శాంతరాజీ. బెంగళూరులో నివాసం ఉంటున్నరుద్రేగౌడ, మహదేవమ్మ కుమారుడు శశికుమార్.

శశికుమార్, కావ్యల వివాహం నిశ్చయం అయ్యింది. ఆదివారం ఉదయం 9 నుండి 10 గంటల మద్యలో కోళ్లేగాళ పట్టణంలోని కనక సముదాయ భవనం (కనక కమ్యూనిటి హాల్)లో ముహుర్తం జరగవలసి ఉంది. శనివారం సాయంత్రం పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెతో పాటు వారి కుటుంబ సభ్యులు, బంధువులు కనక సముదాయ భవనం చేరుకున్నారు.

Escape from the bride marriage hall

శనివారం రాత్రి రిసెప్షన్ జరిగింది. తరువాత అందరు బోజనం చేశారు. పెళ్లి కుమార్తె కావ్య ఆమె గదిలోకి వెళ్లింది. ఆదివారం వేకువ జామున మూడు గంటల సమయంలో కావ్యకు నలుగు పెడుతున్నారు. ఆ సమయంలో తన చేతిలోని ఉంగరం పోయిందని కావ్య హంగామా చేసింది.

తల్లిదండ్రులతో పాటు బంధువులను తప్పుదోవపట్టించింది. తరువాత నీళ్లు కావాలని చెప్పింది. కావ్య తల్లి లక్ష్మి నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన సమయంలో ఆమె అక్కడి నుండి పారిపోయింది. ఉదయం 10 గంటల వరకు కావ్య కోసం ఎదురు చూశారు. ఆమె రాకపోవడంతో పెళ్లి రద్దు అయ్యింది.

చేసేది లేక పెళ్లి కుమారుడు శశికుమార్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు బెంగళూరు బయలుదేరారు. విషయం తెలుసుకున్న కోళ్లేగాళ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కావ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

కావ్య కళ్యాణ మంటపం నుండి పారిపోవడం చాల బాధకలిగించిందని సిగ్గుతో చచ్చి పోతున్నామని ఆమె తల్లిదండ్రులు లక్ష్మి, రాజప్ప అన్నారు. ఈ పెళ్లి ఇష్టం లేదని ఇంతకు ముందు చెప్పలేదని అన్నారు. కావ్య ఎవరిని ప్రేమించలేదని చెప్పిందని, కావ్య గురించి ఇక పట్టించుకోమని వారు విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+