Escape: పెళ్లి కొడుకు చేతిలో తాళి, ప్రియుడితో పెళ్లి కూతురు జంప్, కట్ చేస్తే జైల్లో వరుడు, ఫినిష్!

భోపాల్/ చెన్నై: అమ్మాయి, అబ్బాయి ఇష్టపడటంతో పెద్దలు పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సైడ్ బంధువులు అందరూ కల్యాణమండపం చేరుకున్నారు. గంటలో పెళ్లి జరగడానికి సిద్దం చేశారు. తాళి కట్టడానికి పెళ్లి కొడుకు తహతహలాడుతున్న సమయంలో పెళ్లి కూతురు ఆమె ప్రియుడితో పారిపోయింది. పెళ్లి కూతురు లేచిపోయిందని తెలుసుకున్న పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. పెళ్లి రద్దు చేసుకుని బయలుదేరారు.

ఆ సమయంలో పెళ్లి ఫిక్స్ చేసిన మధ్యవర్తులను పెళ్లి కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులు చితకబాదేశారు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ కొట్టిన దెబ్బలతో ఒకరి ప్రాణాలు గాలిలో కలిసిపోయారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన మరో మధ్య వర్తి కేసు పెట్టడంతో పెళ్లి కొడుకుతో పాటు అతని తండ్రి తదితరులను బోక్కలో వేసి మక్కిలు విరగదీస్తున్నారు.

పెళ్లికి మధ్యవర్తుల జోక్యం

పెళ్లికి మధ్యవర్తుల జోక్యం

మధ్యప్రదేశ్ లోని నజీరాబాద్ జిల్లాలోని గావా గ్రామంలో నివాసం ఉంటున్న దేవ్ కరణ్ మెహర్ (22) అనే యువకుడికి, సాగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నివేదా (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. నజీరాబాద్ కు చెందిన పెళ్లి సంబంధాల మధ్యవర్తులు జగదీష్ మెహర్ (35) హేమ్ రాజ్ (25) అనే ఇద్దరు వీరికి పెళ్లి సంబంధాలు చూశారు.

అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఫిక్స్

అమ్మాయి, అబ్బాయి పెళ్లి ఫిక్స్

దేవ్ కరణ్ మెహర్, నివేదాలు ఇష్టపడటంతో వారి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మొదట పెళ్లి గ్రాండ్ గా చెయ్యాలని అనుకున్నా కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో కేవలం ముహూర్తం మాత్రమే జరిపించాలని, రిసెప్షన్ రద్దు చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. బరాత్ తోని కల్యాణమండపం దగ్గరకు పెళ్లి కొడుకు దేవ్ కరణ్ మెహర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, పెళ్లి కుమార్తె నివేదా బంధువులు చేరుకున్నారు.

ప్రియుడితో పెళ్లి కూతురు ఎస్కేప్

ప్రియుడితో పెళ్లి కూతురు ఎస్కేప్

నివేదా మెడలో తాళి కట్టాలని పెళ్లి కొడుకు ఉబలాటపడ్డాడు. పెళ్లికి అర్దగంట ముందు పెళ్లి కొడుకు దేవ్ కరణ్ మెహర్ కు షాకింగ్ విషయం తెలిసింది. పెళ్లి కుమార్తె నివేదా ఆమె ప్రియుడితో కలిసి వెళ్లిపోయిందని తెలిసింది. కల్యాణమండపంలో ఉన్న పెళ్లి కొడుకు దేవ్ కరణ్ మెహర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు రచ్చరచ్చ చేశారు. పోలీసుల జోక్యంతో పెళ్లి రద్దు చేసుకున్న పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కల్యాణమండపం ఖాళీ చేసి అక్కడి నుంచి ఊరికి బయలుదేరారు.

చెత్తనా కొడకళ్లారా.... చెత్త సంబంధం చూస్తారా!

చెత్తనా కొడకళ్లారా.... చెత్త సంబంధం చూస్తారా!

పెళ్లి కొడుకు దేవ్ కరణ్ మెహర్, అతని తండ్రి తదితరులు పెళ్లి సంబంధం చూసిన జగదీష్, హేమరాజ్ ను వారి ఎస్ యూవీ కారులోకి లాక్కొన్నారు. కారు వేగంగా వెలుతున్న సమయంలో పెళ్లి కొడుకు దేవ్ కరణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మధ్యవర్తులు జగదీష్, హేమ్ రాజ్ లపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. కారు వేగంగా వెలుతున్న సమయంలోనే బెరాసియా నర్సింగ్ హైవే రోడ్డులో ఇద్దరినీ కారులో నుంచి బయటకు నెట్టేసి పరారైనారు.

ప్రాణం పోయింది

ప్రాణం పోయింది

హైవే రోడ్డు పక్కన పోలాల్లో పడిపోవడంతో జగదీష్, హేమ్ రాజ్ బయటకు రాలేకపోయారు. మరుసటి రోజు స్థానికులు గుర్తించి ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై జగదీష్ చనిపోయాడు .ఇంతకాలంలో ఐసీయూలో చికిత్స పొందుతున్న హేమరాజ్ కోలుకుని జరిగిన విషయం మొత్తం పోలీసులకు చెప్పడంతో పెళ్లి కొడుకు దేవ్ కరణ్ మెహర్ కుటుంబ సభ్యుల అరాచకం వెలుగు చూసింది.

పెళ్లి కోసం రూ. 1. 50 లక్షలు కమీషన్

పెళ్లి కోసం రూ. 1. 50 లక్షలు కమీషన్

కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లి కొడుకు దేవ్ కరణ్ తో పాటు అతని తండ్రి మంగీలాల్, మరో నలుగురిని అరెస్టు చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక కథనం వెళ్లడించింది. పెళ్లి సంబంధం ఫిక్స్ చేసినందుకు తాము మధ్యవర్తులు జగదీష్, హేమ్ రాజ్ కు రూ. 1. 50 లక్షలు కమీషన్ ఇచ్చామని నిందితులు పోలీసుకు చెప్పారు.

Recommended Video

    #InternationalWomensDay2021 : 'అమ్మ ఇచ్చిన స్వేచ్ఛతోనే రాణించాం' అంటున్న మహిళల మనోగతం!
    శోభనం కథ గోలీమార్......... జైల్లో పెళ్లి కొడుకు ఫ్యామిలి

    శోభనం కథ గోలీమార్......... జైల్లో పెళ్లి కొడుకు ఫ్యామిలి

    ముహూర్తానికి గంట ముందు పెళ్లి కూతురు లేచిపోవడంతో మా పరువు మొత్తం పోయిందని, అందుకే మేము దాడి చేశామని నిందితులు అంగీకరించారని పోలీసులు అంటున్నారు. తప్పించుకున్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మొత్తం మీద పెళ్లికి గంట ముందు పెళ్లి కూతురు లేచిపోవడంతో దెబ్బకు పెళ్లి కొడుకు హత్య కేసులో చిక్కుకోవడం కలకలం రేపింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+