ఎన్నికల వేళ: మోడీపై విరుచుకుపడిన శివసేన
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీపై, బిజెపి శివసేన తీవ్రంగా విరుచుకుపడింది. తమ మద్దతు లేకపోతే మోడీ తండ్రి దామోదర దాస్ కూడా గెలిచేవారు కారని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో రాసింది. మోడీకి సొంతంగా గెలిచే శక్తి లేదని వ్యాఖ్యానించింది. ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోడీ మహారాష్ట్ర (శివసేన) పార్టీని గుర్తించడం మానేశారని అభిప్రాయపడింది.
అధికార దాహంతో ఉన్న బిజెపి శివసేనను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. మోడీ ముంబైలో ఉంటున్న గుజరాతీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సామ్నా సంపాదకీయంలో ఆయన అన్నారు. పాకిస్తాన్‌ను ఓడించాలని బిజెపికి అధికారం ఇస్తే ఆ పార్టీ తమను పెకిలించాలని ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

బిజెపి మోసాన్ని బట్టబయలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసు, ఎన్సీపి చచ్చిన పాములని వ్యాఖ్యానించారు. బిజెపి తమ ప్రథమ శత్రువని ఆయన వ్యాఖ్యానించారు. తమ నిజమైన శత్రువులు ఎవరనేది బిజెపి తెలుసుకోవాలని అనుకుంటుందా అని అడుగుతూ కాంగ్రెసు, ఎన్సీపి చచ్చిపోయిన పాములని, వాటి నుంచి తమకు ముప్పు లేదని, బిజెపి స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయడం తమ బాధ్యత అని ఆయన అన్నారు.
దేశ ప్రధాని, ఆయన మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఇతరులు వారి వారి సైన్యంతో దిగిపోయారని, పాకిస్తాన్‌ను ఓడించాలని కేంద్రంలో కూచోబడితే, తమ పార్టీని పెకిలించాలని చూస్తున్నారని ఉద్ధవ్ థాకరే అన్నారు. సమాజ్ వాదీ పార్టీ ములాయం సింగ్ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరిగా బిజెపి కుల రాజకీయాలను, ప్రాంతీయతను ఆధారం చేసుకుంటోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications