(లైవ్) ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు: యూపీలో బీజేపీ హవా, మేజిక్ ఫిగర్‌కు దగ్గరగా

లక్నో: 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి.

అయిదు రాష్ట్రాలలో అతిపెద్ద రాష్టమైన యూపీ వైపు అందరి దృష్టి ఉంది. ఇక్కడ బీజేపీ గెలుస్తుంది లేదా అందరికంటే ఎక్కువ సీట్లు సాధిస్తుందని అందరూ భావించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అలాగే కనిపిస్తున్నాయి.

Exit poll results: BJP will win in Uttar Pradesh

యూపీలో హంగ్

ఉత్తర ప్రదేశ్‌లో హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెబుతున్నాయి. అయితే, అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని చెబుతున్నాయి. మేజిక్ ఫిగర్‌కు సమీపంలో బీజేపీ ఉంటుంది.

NDTV - బీజేపీ కూటమి 185, బీఎస్పీ 90, కాంగ్రెస్-ఎస్పీ 120
NewsX - బీజేపీ కూటమి 185, బీఎస్పీ 90, కాంగ్రెస్-ఎస్పీ 120, ఇతరులు 8
Times Now - బీజేపీ 190-210, ఎస్పీ-కాంగ్రెస్ 110-130, బీఎస్పీ 57-74
CNN - బీజేపీ 185, బీఎస్పీ 90, కాంగ్రెస్-ఎస్పీ 90

ఓటు షేర్

ఉత్తర ప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయని కూడా సర్వేలు లెక్కలు తీశాయి. బీజేపీకి ఓటు షేర్ ఎక్కువగా కనిపిస్తోంది.

ABP News - ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి 32 శాతం ఓట్లు, ఎస్పీ-కాంగ్రెస్ పార్టీకి 28 శాతం ఓట్లు, బీఎస్పీకి 26 శాతం ఓట్లు

పంజాబ్ త‌ప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ హ‌వా స్ప‌ష్టంగా కనిపిస్తోంది. ఈ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చూస్తే నోట్ల ర‌ద్దు.. బీజేపీపై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌న‌ట్లు తెలుస్తున్న‌ది.

దేశ‌మంతా ఆస‌క్తి చూస్తున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈసారి బీజేపీ పాగా వేయ‌నున్న‌ట్లు ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయి. ఇక్క‌డ బీజేపీ 185 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిల‌వ‌బోతున్న‌ద‌ని న్యూఎస్ఎక్స్‌-ఎమ్మార్సీ స‌ర్వే అంచనా వేసింది.

యూపీలో ఎస్పీ-కాంగ్రెస్ కూట‌మికి 120, బీఎస్పీకి 90, ఇత‌రుల‌కు 8 సీట్లు వ‌స్తాయ‌న్న‌ది అంచ‌నా. టైమ్స్ నౌ ఎగ్జిల్ పోల్ మాత్రం యూపీలో బీజేపీకి 190 నుంచి 210 సీట్లు వ‌స్తాయ‌ని చెప్పింది. యూపీలో మ్యాజిక్ ఫిగ‌క్ 202. యూపీలో బీజేపీకి 34 శాతం ఓట్లు రానున్న‌ట్లు ఎగ్జిట్‌పోల్స్ అంచ‌నా వేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+