గుజరాత్ బీజేపీదే, కాంగ్రెస్ ఆశలు ఆవిరి: ఎగ్జిట్ పోల్, ఏ సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
Recommended Video

అహ్మదాబాద్: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ముగిశాయి. రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు ఎంతో కీలకంగా మారనున్నాయి. 182 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి.
TOI-C Voter:
TIMES NOW VMR:
Axis-India Today:
ABP-CSDS:
Chanakya:
Total Table:
బీజేపీ ఓట్లను చీల్చేందుకు ఎన్సీపీ, బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీలు పోటీలో నిలిచాయి. మొత్తం 1828 మంది బరిలో నిలిచారు. నిరుద్యోగం, రైతుల కష్టాలు, పటీదార్ల ఉద్యమం, ఓబీసీ సమస్యలు తదితర అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వచ్చాయి. కుల నాయకులతో జట్టు కట్టడంతో పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌కు షాక్ తప్పదని ఎగ్జిట్ ఫలితాలలో తేలింది.

అన్నీ సర్వేలు బీజేపీ వైపే!
దాదాపు అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. టైమ్స్ నౌ, యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే తదితర సర్వేలు బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో కమలం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది.

టైమ్స్ నౌ-వీఎంఆర్ ఓటర్ సర్వే
టైమ్స్ నౌ-వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వేలో బీజేపీ గెలుస్తుందని తేలింది. బీజేపీకి 109 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాలు, ఇతరులకు 3 స్థానాలు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది.

సీ ఓటర్ సర్వే
బీజేపీకి 108 సీట్లు వస్తాయని సీ ఓటరు ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 73 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడయింది. ఇతరులకు ఒక్క సీటు వస్తుందని పేర్కొంది.

సహారా సర్వే
సహారా సర్వేలో బీజేపీకి 110 నుంచి 120 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 75 మధ్య సీట్లు వస్తాయని తేలింది. ఇతరులకు సీట్లు వచ్చే అవకాశాలు దాదాపు లేవని ఈ సర్వేలో వెల్లడైంది.

ఏపీబీ సర్వే
ఏబీపీ న్యూస్ సర్వేలో బీజేపీకి 117, కాంగ్రెస్ పార్టీకి 64, ఇతరులకు 1 సీట్లు వచ్చాయి. మిగతా సర్వేల కంటే ఏబీపీలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊరట అని చెప్పవచ్చు. ఈ సర్వేలో బీజేపీకి గెలుస్తుందని తేలినప్పటికీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఇండియా టుడే సర్వే
ఇండియా టుడే సర్వేలో బీజేపీకి 99-113, కాంగ్రెస్ పార్టీకి 68 నుంచి 82 మధ్య, ఇతరులకు 1 నుంచి 4 మధ్య సీట్లు వస్తాయని తేలింది. దాదాపు అన్ని సర్వేలు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి.

న్యూస్ ఎక్స్ సర్వే
న్యూస్ ఎక్స్ సర్వేలో బీజేపీకి 110 నుంచి 120 సీట్ల మధ్య వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీకి 65 నుంచి 75 సీట్ల మధ్య, ఇతరులకు 2 నుంచి 4 సీట్ల మధ్య వస్తాయని చెబుతున్నాయి. సీఎన్ఎన్-ఐబీఎన్ సర్వేలో బీజేపీకి 109, కాంగ్రెస్‌కు 70 సీట్లు, జీ న్యూస్-యాక్సిస్ సర్వేలో బీజేపీకి 99-113, కాంగ్రెస్‌కు 68-82, న్యూస్ నేషన్ సర్వేలో బీజేపీకి 124-128, కాంగ్రెస్‌కు 52-56, టుడేస్ చాణక్య సర్వేలో బీజేపీకి 135, కాంగ్రెస్‌కు 47 సీట్లు వస్తాయని పేర్కొన్నాయి.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications