ఢిల్లీలో పేలుడు: ఇజ్రాయిల్ ఎంబసీ, గణతంత్ర ముగింపు వేడుకలకు సమీపంలోనే ఘటన
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీ సమీపంలో పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ పేలుడు ప్రభావం ఏ రకమైనదనేది ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా ఐఈడీ పేలుడుగా భావిస్తున్నారు.
టైమ్స్ నౌ కథనం ప్రకారం.. ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం సమీపంలోని ఫుట్పాత్ వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడ పార్కు చేయబడిన పలు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అయితే, పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో భారీ నష్టం జరగలేదు.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఢిల్లీలోని ఔరంగజేబ్ రోడ్లో ఉన్న ఇజ్రాయిల్ ఎంబసీ ఉంది. ఈ పేలుడుకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
A low-intensity explosion happened near the Israel Embassy in Delhi, nature of explosion being ascertained. Some broken glasses at spot. No injuries reported; further investigation underway pic.twitter.com/xqIllrCZOQ
— ANI (@ANI) January 29, 2021
కాగా, గణతంత్ర ముగింపు వేడుకలు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. ఈ వేడుకల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రధాని, కేంద్రమంత్రులు, తదితరులు పాల్గొనడం గమనార్హం.
-
అమెరికా-ఇజ్రాయెల్ మధ్య విభేదాలు? వాన్స్-నెతన్యాహు సంచలన కాల్ లీక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి!












Click it and Unblock the Notifications