మొటిమలు తగ్గడం లేదని యువతి ఆత్మహత్య!
ఇండోర్: ముఖంపై మొటిమలు తగ్గడంలేదని మనస్తాపం చెందిన ఓ యువతి తన నిండుప్రాణాలు బలి తీసుకుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఎంఎస్సీ చదువుతున్న నిధి(22) అనే యువతి గత కొద్ది రోజులుగా ముఖంపై మొటిమల సమస్యతో బాధపడుతోంది.
ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. దీంతో మనస్తాపానికి గురై పంటలకు వాడే క్రిమి సంహారిణి మాత్రలు(సల్ఫెస్ టాబ్లెట్స్) మింగి ఆత్మహత్యకు పాల్పడింది.

నిధిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఎంవై ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మొటిమలు తగ్గకపోవడం వల్లే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందని నిధి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
క్రిమిసంహారక మాత్రలు వేసుకోవడంతో ఆమె కొన్నిగంటలపాటు వాంతులు చేసుకుంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయిందని బాధితురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.












Click it and Unblock the Notifications