Fact Check: కరోనా ఎఫెక్ట్: అక్టోబర్ 15 వరకు హోటళ్లు, రెస్టారెంట్లు బంద్: కేంద్రం ఏం చెబుతోంది?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అన్ని హోటళ్లను కేంద్ర ప్రభత్వం అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించబోతోందనే ఓ సమాచార సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతోంది. హోటళ్లు మాత్రమే కాకుండా.. పర్యాటకులు నివసించడానికి వీలుగా ఉండే రిసార్టులు, రెస్టారెంట్లను కూడా ఆరు నెలల వరకు మూసివేస్తారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికే కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుందనేది దీని సారాంశం.
దీనిపై పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న ఆ వార్తలు గానీ, సమాచారం గానీ నిరాధారమైనదని తేల్చి చెప్పారు. తాము అలాంటి సమాచారాన్ని ఏదీ వెల్లడించలేదని అన్నారు. వైరస్‌ను వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వీలుగా ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లోనే హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులను మూసివేయాల్సి వచ్చిందని, దీన్ని పొడిగించాలనే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాక్‌డౌన్‌పై తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా తాము హోటళ్లను పునరుద్ధరించడంపై తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ పొడిగించడంపై ప్రధానమంత్రి కార్యాలయం ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని వెల్లడించారు. దీనికోసం ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించబోతున్నారని తెలిపారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications