వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేక్ న్యూస్: ఐదు విడతల్లో లాక్‌డౌన్ ఎగ్జిట్..? సోషల్ మీడియాలో వైరల్, ఫేక్ అన్న కేంద్రం

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాధి సమూల నిర్మూలన కోసం విధించిన లాక్‌డౌన్ ఎగ్జిట్ చేసేందుకు ఐదు విడతల్లో ఆంక్షలను సడలిస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని కేంద్ర ప్రభుత్వం వర్గాలు స్పష్టంచేశాయి. అది భారతదేశం యొక్క విధానం కాదు అని తేల్చిచెప్పాయి.

కరోనా వైరస్ నిబంధనలను ఐదు విడతల్లో తగ్గిస్తూ వస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. మొదటి విడతలో భాగంగా మే 18వ తేదీ వరకు మూడువారాలు పరిస్థితిని అంచనా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మే 18వ తేదీ తర్వాత జూన్ 8వ తేదీన రెండో విడత అని.. జూన్ 29వ తేదీ మూడో విడత, జూలై 20వ తేదీ నాలుగో విడత అని ప్రచారం జరుగుతోంది. చివరగా ఐదో విడత ఆగస్ట్ 10వ తేదీన ఉంటుందని.. ఆ సమయానికి నింబంధనలు మొత్తం తీసివేస్తారని పేర్కొంటున్నారు. అయితే ఇది కరోనా వైరస్ తగ్గితే.. మరీ వైరస్ పెరిగితే పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తుందని కూడా సోషల్ మీడియాలో వార్త ట్రోల్ అవుతోంది.

Fake: This is not India’s strategy to exit the lockdown

సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోన్నవార్త అబద్దం అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. తమ వద్ద అలాంటి విధానం ఏమీ లేదని తేల్చిచెప్పింది. నిబంధనల సడలింపు అంశం భారతదేశానిది కాదు అని.. ఇతర దేశాలు ఏమైనా అవలంభిస్తున్నాయి కావొచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం క్లారిటీతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న న్యూస్ ఫేక్ అని స్పష్టమైంది.

English summary
There is a message circulating which says the government is planning five-phase exit to the lockdown.this message is fake government clarify
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X