మోడీ హయాంలో తగ్గిన ఆహార ఉత్పత్తుల ధరలు

గత కొన్ని నెలలుగా ఆహార ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచగలిగింది. అయితే ఈ ధరల తగ్గుదలతో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది .ముఖ్యంగా ఖర్చుల వివరాలు చెప్పాల్సినప్పుడు ఈ ఇబ్బందులను ఎదుర్కొంది. మంచి పంట పెరిగిన వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో ధరలు తగ్గుముఖం పట్టాయి. ధరలు తగ్గుదలతో ద్రవ్యోల్బణం తగ్గటం అంటే రైతులకు ప్రభుత్వం కొన్ని పంటలపై పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు కంకణం కట్టుకుంది. అంతేకాదు 2022కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రధాని మోడీ పనిచేస్తున్నారు.

ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే అది వినియోగదారులకు మేలు చేకూర్చుతుంది. వరి, పాలు, నూనెగింజల ద్రవ్యోల్భణం తగ్గిపోగా... ధాన్యాలుచ గోధుమలు, ఆలూ ద్రవ్యోల్బణం వరసగా 5.54శాతం, 8.87శాతం,80.13శాతంగా పెరిగినట్లు గతవారం విడుదలైన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉంటే హోల్‌సేల్ మార్కెట్లో ఉల్లి, గుడ్ల, మాంసాహారలపై ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముడిచమురు ధరల్లో పెరుగుదల కనిపించడంతో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుందని అంతా భావించారు. ఆయిల్ ధరలు పెరిగిన లేదా తగ్గినా దానికి అనుగుణంగానే ద్రవ్యోల్బణం కూడా ఉంటుంది. ముడిచమురు ధరలు పెరిగితే ఇది ఆర్థిక వ్యవస్థలోని ఆర్థికలోటు, ప్రస్తుత ఖాతా లోటులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తద్వారా మోనిటరీ విధానాలు, పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.

Falling food prices: A double edged sword

ద్రవ్యోల్బణం గురించి ఇంకా సులభంగా వివరించాలంటే మార్కెట్ ధరలపై ప్రభావం చూపేదిగా చెప్పొచ్చు. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటే ప్రభుత్వం ధరలు నియంత్రణలో సఫలమైందని అర్థం. ఇది వినియోగదారులకు మేలు చేకూర్చేదే అయినా ఖర్చుల పరంగా ప్రభుత్వానికి సమస్య కలిగించేదని చెప్పొచ్చు. భారత హోల్ సేల్ ధరల సూచిక సెప్టెంబర్ 2018లో 5.13శాతానికి చేరింది. ఇది ఆగష్టులో 4.53శాతంగా ఉన్నింది. సెప్టెంబర్ క్వార్టర్ ముగిసే సమయానికి హోల్ సేల్ ధరల సూచికలో 4.98శాతం వార్షిక పెరుగుదల నమోదు చేసుకుంది. మరోవైపు వినియోగదారుడి ధర సూచిక 3.88శాతానికి పెరిగింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోల్‌సేల్ ధరల సూచిక ద్వారా నమోదయ్యే ద్రవ్యోల్బణంనే పరిగణలోకి తీసుకుని మోనిటరీ విధానాలను అంచనా వేస్తుంది. ఇప్పుడు మాత్రం వినియోగదారుడి ధరల సూచిక ద్రవ్యోల్బణంనే పరిగణలోకి తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+