చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి ఆరోగ్యం విషమం: అర్ధరాత్రి ఆస్పత్రికి తరలింపు, స్టాలిన్‌కు మోడీ ఫోన్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఆయన్ను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత హుటాహుటిన చెన్నై నగరంలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులతోపాటు భారీ సంఖ్యలో డీఎంకే నేతలు కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు.

Recommended Video

మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ విడుదల

కాగా, కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడుతోందని, జ్వరం తగ్గిందని డీఎంకే నేతలు స్టాలిన్‌, దురైమురుగన్‌, అళగిరి తదితరులు రాత్రి పదింటి వరకు ప్రకటించారు. వదంతులు నమ్మవద్దని పార్టీశ్రేణులకు భరోసానిస్తూ వచ్చారు. స్టాలిన్‌ సహా ఇతర నేతలంతా కరుణ నివాసం నుంచి వెళ్లిపోయారు.

Family, crowds leave hospital after hospital says Karunanidhi is stable

అయితే, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.15గంటల ప్రాంతంలో స్టాలిన్‌, అళగిరి, ఎ.రాజా, కనిమొళి, దురైమురుగన్‌ మరోసారి గోపాలపురంలోని కరుణ నివాసానికి చేరుకున్నారు. వారితో పాటు కావేరి ఆసుపత్రి వైద్యుల బృందం అంబులెన్స్‌తో సహా వచ్చారు. కరుణానిధిని అంబులెన్స్‌లో ఆస్పత్రిలో చేర్చారు.

Family, crowds leave hospital after hospital says Karunanidhi is stable

కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించామని తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగత వైద్యులు డాక్టర్‌ గోపాల్‌ తెలిపారు. కరుణానిధి ఆరోగ్యం విషమంగా ఉందని, రక్తపోటు పడిపోయిందని ఆయన వెల్లడించారు. ఆయన్ను ఐసీయూలో చేర్చుతున్నామన్నారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని శనివారం ఉదయం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే కార్యకర్తలు ఆస్పత్రి వద్ద నుంచి వెళ్లిపోయారు.

Family, crowds leave hospital after hospital says Karunanidhi is stable

కాగా, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ ద్వారా కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు 'కరుణానిధి ఆరోగ్యంపై స్టాలిన్‌, కనిమొళితో మాట్లాడాను. ఏదైనా అవసరమైతే చేస్తానని చెప్పాను... ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నాను' అని మోడీ ట్విట్టర్‌లో వెల్లడించారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, వామపక్ష పార్టీల నేతలు సీతారాం ఏచూరి, డి. రాజా కూడా కరుణానిధి ఆరోగ్యంపై వాకబు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కరుణ ఆరోగ్య పరిస్థితిపై స్టాలిన్‌తో మాట్లాడారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
DMK chief M Karunanidhi was shifted to a Chennai hospital past midnight, hours after his son MK Stalin issued a statement that there is an improvement in his health. The DMK chief is being treated at his residence for fever due to Urinary Tract Infection (UTI).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X