Family: ఒకే ఫ్యామిలీలో నలుగురు కూతుర్తు, కొడుకు, భార్య హత్య, ఆ మ్యాటర్ లో తేడా వచ్చి. క్లైమాక్స్ లో ?
చెన్నై/సేలం: వివాహం చేసుకున్న వ్యక్తి అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. దంపతులు చాలా అన్యోన్యంగా ఉండటంతో దంపతుల కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. దంపతులకు ఐదు మంది కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నాడు. అరడజను పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. రానురాను ఎవరు రాజీ చేసినా దంపతులు మాత్రం పద్దతి మార్చుకోలేదని తెలిసింది. ఇదే సందర్బంలో భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రాత్రి ఇంటికి వెళ్లిన భర్త ఇంట్లోని ఐదు మందిని నరికి చంపేశాడు.

దంపతుల హ్యాపీలైఫ్
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని పుదుపాళ్యం సమీపంలోని ఒరవంతవాడి పంచాయితీోని మోత్తూరు గ్రామంలో పళని (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం పళని వల్లీ (39) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న పళని అతని భార్య వల్లీతో చాలా సంతోషంగా కాపురం చేశాడు.

ఐదు మంది కూతుర్లు
పళని, వల్లి దంపతులు చాలా అన్యోన్యంగా ఉండటంతో వారి కుటుంబ సభ్యులు చాలా సంతోషించారు. పళని, వల్లీ దంపుతులకు సౌందర్య (19), త్రీషా (16), మోనీషా (14), శివశక్తి (6), భూమిక (9) అనే కుమార్తెలతో పాటు ధనుష్ (4) అనే కుమారుడు ఉన్నాడు. నలుగురు కూతుర్లు, కుమారుడితో కలిసి పళని, వల్లీ దంపతులు చాలా సంతోసంగా ఉండేవారు.

కుమార్తె పెళ్లి తరవాత ?
గత ఏడాదిలో పెద్ద కుమార్తె సౌందర్య వివాహం చేశారు. సౌందర్య ఆమె భర్తతో కలిసి వేరే ఊరిలో నివాసం ఉంటున్నది. పళని, వల్లీ దంపతులు వారి నలుగురు కుమార్తెలు, కొడుకు ధనుష్ తో పాటు సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. పళని భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ అతని భార్య, పిల్లలను పోషిస్తున్నాడు.

రాత్రి అందర్నీ నరేకేసి భర్త..... చివరికి ఆత్మహత్య
రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన పళని అతని భార్య వల్లీతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన పళని వేట కొడవలి తీసుకుని అతని భార్య వల్లీతో పాటు నలుగురు కుమార్తెలు, కొడుకు ధనుష్ ను దారుణంగా నరికేశాడు. ఐదు మంది మీద కొడవలితో దాడి చేసిన పళని తరువాత ఇంటిలో ఉరి వేసుకున్నాడు.

భూమిక పరిస్థితి ?
మరుసటి రోజు ఎంతసేపు అయినా పళని, వల్లీ దంపతులుబయటకు రాకపోవడంతో పక్కనే ఉన్న బంధువులకు అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూశారు. అందరూ రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందరూ చనిపోయినా భూమికా ప్రాణాలతో ఉండటంతో ఆమెను తిరువణ్ణామలై ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

అసలు ఏం జరిగింది ?
దంపతుల మద్య గొడవ కారణంగా భర్త అతని భార్యతో పాటు నలుగురు పిల్లలను హత్య చేశాడని పోలీసులు అన్నారు. ఒకే కుటుంబంలోని ఐదు మందిని హత్య చేసిన భర్త అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తమిళనాడులో కలకలం రేపింది. అయితే పళని ఎవరి మీద కోపంతో ఐదు మందిని హత్య చేశాడు, ఆర్థిక సమస్యలా, లేక వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications