రైతు ఉద్యమం: ‘ట్విటర్’ను మూసేస్తామని భారత ప్రభుత్వం బెదిరించిందన్న జాక్ డోర్సీ.. ఖండించిన కేంద్రం

భారత్‌లో రైతు ఉద్యమం (2020-21) జరిగిన సమయంలో ట్విటర్‌ను మూసివేయాలంటూ భారత ప్రభుత్వం తనను బెదిరించిందని ట్విటర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సీ ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు.
ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న చాలా మంది భారతీయ జర్నలిస్టుల ఖాతాలను మూసివేయాలని చెప్పినట్టు జాక్ డోర్సీ ఆరోపించారు.
జాక్ డోర్సీ ఆరోపణలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు.
జాక్ డోర్సీ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, ఆయన హయాంలో ట్విటర్ ఎన్నోసార్లు భారత చట్టాన్ని ఉల్లంఘించిందని చంద్రశేఖర్ అన్నారు.
జాక్ డోర్సీ ఏమన్నారు?
యూట్యూబ్ ఛానల్ 'బ్రేకింగ్ పాయింట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాక్ డోర్సీ ఈ విషయాలు చెప్పారు.
శక్తిమంతమైన వ్యక్తుల నుంచి వచ్చే డిమాండ్ల గురించి డోర్సీని ప్రశ్నించగా, ఆయన భారత ప్రభుత్వం తనను బెదిరించిందని చెప్పారు.
ప్రశ్నోత్తరాలు ఇలా సాగాయి.
ప్రశ్న: ప్రపంచం నలుమూలల నుంచి శక్తిమంతమైన వ్యక్తులు మీ వద్దకు వచ్చి అనేక డిమాండ్లు చేస్తారు. మీరు కొన్ని విలువలను, సిద్ధాంతాలను పాటించే వ్యక్తిగా ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారు?
జవాబు: భారతదేశాన్ని ఉదాహరణగా తీసుకుంటే, రైతు ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టుల గురించి మా వద్దకు చాలా డిమాండ్లు వచ్చాయి. ఒక రకంగా బెదిరించారు. ట్విటర్‌కు భారత్‌లో పెద్ద మార్కెట్ ఉందని, దాన్ని మూసివేస్తామని, మా ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పారు. వాళ్ల మాట వినకపోతే మా ఆఫీస్ మూసివేస్తామని బెదిరించారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి ఇలాంటి డిమాండ్లు వచ్చాయి.
https://twitter.com/ani/status/1668457492974813184?s=48&t=EANcy2WpaPj_4decjgMoNQ
కేంద్ర ప్రభుత్వ స్పందన
జాక్ డోర్సీ చేసిన ఆరోపణలపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు.
"జాక్ డోర్సీ చెబుతున్నది పచ్చి అబద్ధం. బహుశా, ట్విటర్ చరిత్రలో అనుమానాస్పదంగా వ్యవహరించిన ఆ కాలాన్ని కప్పిపెట్టే యత్నం చేస్తున్నట్టున్నారు. డోర్సీ, ఆయన బృందం ఆధ్వర్యంలో ట్విటర్ భారత చట్టాన్ని పదే పదే ఉల్లంఘించింది. వాస్తవానికి, 2020 నుంచి 2022 వరకు వాళ్లు చట్టాన్ని సరిగ్గా పాటించలేదు. 2022 జూన్ నుంచి మాత్రమే చట్టానికి కట్టుబడి పనిచేశారు. కానీ, ఎవరూ జైలుకు వెళ్లలేదు. ట్విటర్‌ను మూసివేయలేదు. డోర్సీ నేతృత్వంలో ట్విటర్‌కు భారతదేశ చట్టాలను, సార్వభౌత్వాన్ని అంగీకరించడంలోనే సమస్య ఉంది" అని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.
భారత్-ట్విటర్ మధ్య యుద్ధం
ఏప్రిల్‌లో విడుదల చేసిన ట్విటర్ ట్రాన్స్‌పరెన్సీ నివేదిక ప్రకారం, ట్విటర్ నుంచి కంటెంట్‌ను తొలగించాలని డిమాండ్ చేసే దేశాల్లో భారతదేశం ముందుంది.
ట్విటర్ తాజా నివేదిక ప్రకారం, 2022 జనవరి 1 నుంచి 2022 జూన్ 30 మధ్య ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ట్విటర్‌లో కంటెంట్‌ను తీసివేయాలని డిమాండ్ చేస్తూ 53 వేల లీగల్ నోటీసులు ఆ సంస్థకు అందాయి.
ట్విటర్ ప్రకారం, ఈ డిమాండ్లు చేస్తున్న దేశాల్లో భారతదేశం, అమెరికా, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ ముందు వరుసలో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: సీఎం జగన్‌కు బీజేపీ గుడ్‌బై చెప్పినట్లేనా... అమిత్ షా వ్యాఖ్యల ఆంతర్యమేంటి?
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- వక్షోజాలు పెరగడానికి హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటే ఏమవుతుంది?
- రాక్ క్లైంబింగ్ సురక్షితంగా చేయడం ఎలా... ట్రైనర్ చెప్పే పాఠాలేంటి?
- మీ డేటా చోరీకి గురైతే ఏమవుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications