రామమందిర ప్రాణప్రతిష్టకు హాజరయిన ముస్లిం చీఫ్‌కు ఫత్వా...
జనవరి 22న అయోధ్యలోని రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ముస్లిం చీఫ్‌పై ఫత్వా జారీ అయ్యింది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి రామమందిర వేడుక అనంతరం సాయంత్రం నుంచే ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగింది. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట వేడుక తర్వాత సోషల్ మీడియా వేదికగా తనకు వ్యక్తిగతంగా ఫత్వా జారీ అయిందని ఆయన తెలిపారు.
ఈ నెల 22న అయోధ్య రామమందర విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా వ్యవహరించిన ఇక్బాల్ అన్సారీతో పాటు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసికి కూడా రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వన పత్రికలు అందజేసింది. అంతేకాకుండా, ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపించింది.

ఇక, ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ముస్లిం చీఫ్ ఉమర్ అహ్మద్ ఆహ్వానం అందిన రెండు రోజులు బాగా ఆలోచించి తాను అయోధ్యకు వెళ్లినట్లుగా వివరించారు. అయితే తాను ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు హాజరైన అనంతరం తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన స్వయంగా వివరించారు. ముఖ్యంగా ఒక వర్గం తనను తీవ్రంగా తిడుతున్నట్లు కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియా వేదిక ద్వారా తనకు వ్యక్తిగతంగా ఫత్వా కూడా జారీ చేశారని ఆయన అన్నారు.
నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదు..
అన్ని మసీదు అథారిటీలకు, ఇమామ్‌లకు తన ఫోన్ నంబర్‌ను చేరవేసి, తనను బహిష్కరించాలంటూ అందులో పేర్కొన్నారని ఇమామ్ తెలిపారు. అంతేకాకుండా, అయోధ్య వేడుకకు హాజరైనందుకు క్షమాపణలు చెప్పి, ఇమామ్ పదవి నుంచి తప్పుకోవాలని ఫత్వాలో పేర్కొన్నట్లు ఆయన వివరించారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ఇలా మాట్లాడారు. నేను ఎలాంటి తప్పుచేయలేదు.. కాబట్టి క్షమాపణ చెప్పే అవసరం నాకు లేదు. నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన తేల్చి చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications