వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమరానికి సై: తమిళనాడు భారీ బడ్జెట్ ! పదవి ఉంటుందా, ఊడుతుందా

2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్ దాఖలు చేయడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తులే చేసింది. గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి, ఆ రాష్ట్ర ఆర్థ

|
Google Oneindia TeluguNews

చెన్నై: 2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్ దాఖలు చేయడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తులే చేసింది. గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి, ఆ రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి డి జయకుమార్ కు కొత్తే.

సీఎంగా ఎడప్పాడి పళనిసామి, ఆర్థిక మంత్రిగా డి. జయకుమార్ కొత్తగా వారి పదవులకు ప్రప్రథమంగా ఎంపికైనారు. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ పై సర్వాత్రా ఎదురు చూపులు పెరిగాయి. ప్రజాకర్షణ లక్షంగా ముందుకు సాగాలంటే ఈ బడ్జెట్ లో భారీ కేటాయింపులు, ప్రత్యేక పథకాలు తప్పనిసరి.

Finance Minister D Jayakumar will be presenting his first budget in the TN Assembly on today.

అయితే తమిళనాడులో నిధుల కొరత తాండవం చేస్తుండటంతో తాజా బడ్జెట్ ఎలా ఉంటుందోనన్న ప్రశ్న బయలుదేరింది. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్న సందర్బంగా బడ్జెట్ ప్రవేశపెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏర్పడింది.

తన పాలనాదక్షతను చాటుకునేందుకు ఈ బడ్జెట్ ను ఎడప్పాడి పళనిసామి కీలకంగా బావించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు కొత్త భారాన్ని మోపుతారా, లేదా ప్రజల నెత్తిన భారం పడకుండా కొత్త పథకాలతో ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తారా అన్నది నేడు తేలనుంది.

జయలలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన పన్నీర్ సెల్వం బడ్జెట్ ప్రవేశపెట్టారు. జయలలిత మరణం తరువాత పన్నీర్ సెల్వం పార్టీ పై తిరుగుబాటు చెయ్యడంతో ఆర్థిక మంత్రి పదవి జయకుమార్ చేతిలోకి వెళ్లింది. గురువారం ఉదయం జయకుమార్ తమిళనాడు శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

English summary
Finance Minister D Jayakumar will be presenting his first budget in the TN Assembly on today. The budget for 2017-18 is likely to be a tax-free.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X