వైద్యురాలిపై లైంగిక వేధింపులు: కాశ్మీర్ మంత్రిపై కేసు

FIR against Kashmir minister for alleged sexual assault
శ్రీనగర్: తనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఓ వైద్యురాలు స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదును స్వీకరించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ నిందితుడైన మంత్రిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు షబ్బీర్ అహ్మద్ ఖాన్‌పై ఐపిసి 354, 509 సెక్షన్ల కింద షాహీద్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేవారు.

బాధితురాలైన మహిళా వైద్యురాలి ఫిర్యాదు ప్రకారం.. జనవరి 28న తాను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్‌ను కలిసేందుకు రాష్ట్ర సచివాలయానికి వెళ్లానని చెప్పారు. ఆయనతో మాట్లాడుతుండగా ఆయన తనకు టీ తెప్పించారని తెలిపారు. ఆ టీ తాగిన తర్వాత తనకు మత్తు ఆవరించిందని ఆమె చెప్పారు. ఆ క్రమంలోనే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు.

ఇది ఇలా ఉండగా బాధితురాలి ఆరోపణలపై స్పందించేందుకు మంత్రి అహ్మద్ ఖాన్ నిరాకరించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అహ్మద్ ఖాన్ ఆరోగ్యశాఖ మంత్రి పదవిలో ఉన్నారు. కాగా బాధితురాలు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని, కోర్టు ఆదేశంతోనే కేసు నమోదు చేశారని స్థానికులు చెబుతున్నారు.

క్రిమినల్ పీనల్ కోడ్ 509 సెక్షన్ కింద నేరం రోజువైతే నిందితునికి కనీసం ఒక సంవత్సరం జైలు శిక్ష విధించబడుతుంది. అలాగే 354 సెక్షన్ కింద నేరం రుజువైతే రెండేళ్లపాటు నిందితునికి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. కాగా నిందితుడైన మంత్రి షబ్బీర్ అహ్మద్ ఖాన్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని విపక్షాల నాయకులు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+