మోడీ ఫిర్యాదు: శ్రీనివాసన్, మీయప్పన్‌ల పైన ఎఫ్ఐఆర్
జైపూర్: బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మాజీ కమిషనర్ లలిత్ మోడీ ఫిర్యాదుతో శ్రీనివాసన్‌తో పాటు ఆయన అల్లుడు గురునాత్ మీయప్పన్‌ల పైన ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఐపిఎల్ 6లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్రాయల్స్ ఆటను ఫిక్స్ చేశారన్న అభియోగంతో వీరి పైన లలిత్ మోడీ తరఫు న్యాయవాది మహ్మద్ అబ్ధి శుక్రవారం రాజస్థాన్‌లోని ఓ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అబ్ధి అక్టోబర్ 26, 28 తేదీలలో స్థానిక కోర్టులో శ్రీనివాసన్, గురునాథ్ మీయప్పన్ ల పైన ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణల పైన దర్యాఫ్తు జరిపించాలని జైపూర్ పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో జ్యోతి నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.












Click it and Unblock the Notifications