ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. రెండో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఏ ప్రమాదం చోటు చేసుకోలేదని సమాచారం.
మంగళవారం ఉదయం 3.35 నిమిషాల సమయంలో రెండో ఫ్లోర్‌లోని గది నంబర్ 242లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఓ సెక్షన్ అధికారికి ఆ రూమ్‌లోని కంప్యూటర్ యూపీఎస్ నుంచి మంటలు రావటంతో ఘటన చోటు చేసుకుందని నిర్ధారించారు.

సమాచారం అందుకున్న వెంటనే 10 ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసి కేవలం 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు డివిజినల్ ఫైర్ అధికారి గుర్ముఖ్ సింగ్ తెలిపారు. కాగా, స్వల్ఫ ప్రమాదమేనని.. అధికారిక రికార్డులన్నీ సురక్షితంగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications