వికాస్ భవన్‌లో అగ్నిప్రమాదం.. మహిళ కమిషన్‌లోకి వ్యాపించిన మంటలు...

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున భారీ అగ్నిప్రమాదం జరిగింది. వికాస్ భవన్ రెండో అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. అగ్నిప్రమాదం విషయం తెలుసుకొని వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 8 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని .. ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Fire breaks out at Vikas Bhawan in central Delhi, DCW office in danger

ఢిల్లీ వికాస్ భవన్‌లో అగ్నిప్రమాదం జరగడంతో కలకలం రేగింది. వికాస్ భవన్‌లో చెలరేగిన మంటలు రెండో అంతస్తులో ఉన్న ఢిల్లీ మహిళా కమిషన్ కార్యాలయానికి కూడా వ్యాపించాయి. అగ్నిప్రమాదంపై మహిళ కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివల్ మాట్లాడుతూ .. తమ కార్యాలయానికి మంటలు అంటుకున్నాయని వార్తల్లో చూసి తెలుసుకున్నానని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ కార్యాలయంలో ఎంతమంది ఉన్నారనే అంశంపై క్లారిటీ రాలేదన్నారు. వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారా లేదా అనే అంశంపై స్పష్టత రాలేదన్నారు. మంటల్లో తమ ఆఫీసు రికార్డు గదికి కూడా మంటలు వ్యాపించి ఉంటాయని అంచనా వేశారు. మరోవైపు మార్చిలో కూడా ఇదే భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులో ప్రమాదం జరిగింది. కానీ అప్పుడు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+