ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ప్రమాదం.. మంటలను ఆర్పిన సిబ్బంది
భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య మీద బుధవారం ప్రమాదం జరిగింది. ఇదీ చిన్న ప్రమాదం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సిబ్బంది రంగంలోకి మంటలను ఆర్పివేశారు. కడపటి వార్త అందేసరికి ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. ప్రమాదం జరిగే సమయంలో షిప్ కార్వార్ వద్ద నడుస్తోంది. ఓడ సిబ్బంది ఆన్ బోర్డు ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయం కాలేదని నౌకాదళం ప్రకటించింది. ఘటనపై బోర్డు ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రమాదంతో దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. మంటలు రావడానికి గల కారణం విచారణలో తేలనుంది. కుట్ర కోణంపై కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications