సినీ ఫక్కీలో కోర్టులో కాల్పుల కలకలం: ఉలిక్కిపడ్డ ఢిల్లీ: ఒకరి మృతి.. భయాందోళనలు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గన్ కల్చర్ పెచ్చరిల్లినట్టే కనిపిస్తోంది. న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోన్న సమయంలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు. తనపై నమోదైన కేసుల విచారణ కోసం అతను న్యాయస్థానం ముందు హాజరయ్యాడు. కాల్పులు చోటు చేసుకున్న సమయంలో కోర్టులో పలువురు న్యాయవాదులు, సందర్శకులు ఉన్నారు. వారందరి మధ్య విచారణ కొనసాగుతోన్న సమయంలో దండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఢిల్లీ ఉలిక్కిపడింది.

మృతుడిని ఉప్కార్‌గా గుర్తించారు. ఓ కేసులో అతను నిందితుడు. తనపై నమోదైన కేసుల విషయంలో ఢిల్లీ ద్వారకా కోర్టు సముదాయంలో 444 నంబర్ ఛాంబర్‌కు హాజయ్యాడు. అతని తరఫు న్యాయవాదులు, పొోలీసులు అతని వెంట ఉన్నారు. కోర్టు పనుల మీద వచ్చిన పలువురు ఆ సమయంలో ఆవరణలో తిరుగాడుతోన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఉప్కార్‌పై కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ న్యాయవాదిగా పోలీసులు అనుమానిస్తోన్నారు. అతని కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Firing inside Delhis Dwaraka court, man gunned down, who appearing for hearing

సమాచారం అందుకున్న వెంటనే ద్వారకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉప్కార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. న్యాయస్థానానికి వచ్చి మరీ నిందితుడిపై కాల్పులు జరపడానికి గల కారణాలను గురించి అన్వేషిస్తోన్నారు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తి న్యాయవాది కావడం వల్ల పాతకక్షల కోణంలో దర్యాప్తు చేపట్టామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లోనూ విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశామని, సీసీటీవీ ఫుటేజీలు, సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా అతని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు.

Recommended Video

    PM Modi Numerology Secret,కేబినెట్ విస్తరణలో ప్రతీ అంశంలో అంతా ఏడు తోనే ముడిపెడుతూ..!!

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+